బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో ఒక్కో వారం గడుస్తుంటే పరిస్థితులు ఎంత కఠినంగా మారిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా నామినేషన్ సమయం వచ్చింది అంటే అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవాళ్లే..ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఎలాంటి కారణాలతో నామినేట్ చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంటారు.
ఇలా ఐదు వారాలు గడిచిపోయింది. ఆరో వారం కూడా చివరకు చేరుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు, కొట్లాటలకు కొదవ లేకుండా పోయింది. కెప్టెన్స్ కంటెడర్స్ టాస్క్ అయిన బీబీ బొమ్మల ఫ్యాక్టరీలో యానీ మాస్టర్, శ్వేతలు బద్ధ శత్రువులుగా మారిపోయారు. బిగ్ బాస్ పంపించే బొమ్మలు, అందులో వాడే దూదిని వాడాల్సి ఉంటుంది అందరు.
కానీ శ్వేత, లోబా మాత్రం బిగ్ బాస్ ప్రాపర్టీ అయిన కుషన్స్ చింపి అందులో ఉన్న దూదిని వాడారు. ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ బిగ్ బాస్ వారిపైన సీరియస్ అయ్యారు. వారు ఆ పని చేస్తుంటే అడ్డుకోలేకపోయిన సంచాలకులు సిరి, కాజల్ పై కూడా బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. రవి టీం మరియు సంచాలకులుగా ఉన్న సిరి, కాజల్ ను కెప్టెన్ అయ్యేందుకు అనర్హులుగా ప్రకటించారు.
అయితే కుషన్స్ చింపేసింది లోబో, శ్వేత అయినప్పటికీ.. ఆ ఐడియా రవి. దీంతో నీవల్లే ఇదంతా జరిగిందని రవిని మందలించింది శ్వేత. రవి ఐడియా విఫలం అయినందు అతడు అందరి ముందు స్వారీ కూడా చెప్పాడు. అయితే రవి ఇచ్చిన ఐడియాను వదిలిపెట్టి శ్వేతకు వరెస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకున్నారు. రవి కారణంగానే శ్వేత బలైందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…