Movie News

Adipurush: డబ్బు కోసమే ఆ ప్లాన్… ఆది పురుష్ సినిమా గురించి మరోసారి గుప్పుమన్న పుకార్లు…?

Adipurush: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ప్రభాస్ మొదటిసారిగా రామాయణం వంటి పౌరాణిక కథలో నటిస్తుండటంతో ఈ సినిమా మీద ప్రేక్షకులో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం వల్ల సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆకృతగా ఎదురు చూస్తుంటే మరికొందరు మాత్రం పని కట్టుకొని ఈ సినిమా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ సినిమా గురించి అనేక రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ వేషధారణ గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. రాముడికి మీసాలు ఉండవని, అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ చెప్పులు కూడా ధరించాడని సినిమా గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు.

ఈ సినిమా విడుదల చేసినప్పుడు థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీట్ కేటాయించాలని ఈ సినిమా దర్శకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. ఎందుకంటే రాముడికి పరమ భక్తుడైన హనుమంతుడు రాముడి పారాయణం జరిగే ప్రతి చోట ఉంటాడని అందువల్ల సినిమా విడుదల చేసిన ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే దీని గురించి కూడా కొందరు పనిగట్టుకుని పుకార్లు పుట్టిస్తూ సినిమా మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

Adipurush: భక్తితో కాదు… డబ్బు కోసమే


ఆదిపురుష్ యూనిట్ హనుమంతుడికి సీట్ కేటాయిస్తోంది భక్తితో కాదని.. డబ్బు కోసం అంటూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. హనుమంతుడికి కేటాయించిన సీట్ పక్క సీట్లకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాబట్టి హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరల్ని అధిక మొత్తంలో పెంచి విక్రయించబోతున్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ రూమర్ పై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఆ వార్తలలో వాస్తవం లేదని ఫేక్, హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరలు కూడా నార్మల్ గానే ఉంటాయి అని క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago