Aditi Rao -Siddharth: టాలీవుడ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థం నిన్న హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది.ఈయన నిశ్చితార్థ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. రామ్ చరణ్ దంపతులతో పాటు నాగార్జున దంపతులు చిరంజీవి దంపతులు కూడా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలలో నటి అదితి రావు హైదరి నటుడు సిద్ధార్థ్ కూడా సందడి చేయడం గమనార్హం.
గత కొద్దిరోజులుగా అదితి రావు సిద్ధార్థ్ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. అలాగే నటి అదితి రావు పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆమెతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హాట్ అంటూ తనకు స్పెషల్ విషెస్ తెలియజేయడంతో వీరి మధ్య ఉన్న రిలేషన్ కు మరింత బలం చేకూరింది.
ఇలా తరచూ వీరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇద్దరిలో ఎవరు కూడా స్పందించలేదు. ఈ క్రమంలోనే వీరి గురించే వచ్చే వార్తలు నిజమేనని అందరూ భావించారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి శర్వానంద్ నిశ్చితార్థానికి రావడంతో మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే శర్వానంద్ నిశ్చితార్థ కార్యక్రమంలో సిద్ధార్థ్, అదితి ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇకపోతే శర్వానంద్ సిద్ధార్థ్ ఇద్దరు కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాల్లో సిద్ధార్థ్ కు జోడిగా అదితి రావు హైదరి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉండడంతోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు బలమయ్యాయి. ఏది ఏమైనా ప్రస్తుతం వీరిద్దరూ శర్వానంద్ నిశ్చితార్థంలో సందడి చేయడంతో వీరి రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చినట్టేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…