Aditya 369: బాలకృష్ణ కెరీర్ లో మాస్ మసాలా యాక్షన్ సినిమాలు ఎన్నున్నాయో అలాగే ప్రయోగాత్మక సినిమాలు కూడా ఉన్నాయి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలు ఈ కోవకే చెందుతాయి. ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో భైరవ ద్వీపం వంటి సినిమాలో కురూపిగా చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక ఆదిత్య 369 వంటి సినిమాలో అటు శ్రీకృష్ణ దేవరాయలుగా నటించి మరో వైపు కృష్ణ అనే యువకుడి పాత్రలో కూడా అలరించాడు. భవిష్యత్తు చూడగల టైం మిషిన్ లో టైం ట్రావెల్ చేయడం వంటి కాన్సెప్ట్ ను తొంభై లలో చూపించడం సాహసం. అలాంటి ఒక చిత్రాన్ని చేయడానికి మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణ ఒప్పుకోవడం మరింత సాహసం.
369 అంటే అర్థం అదే…
ఇక సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ లో ‘369’ అంటే ఏంటో సినిమా వచ్చి ఎన్నేళ్ళైనా ఎన్ని సార్లు చూసినా ఇప్పటికీ తెలియదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో బాలకృష్ణకు ఈ ప్రశ్న ఎదురైంది. అయితే బాలకృష్ణ ఆదిత్య అంటే సూర్యుడు అంటూ చెప్పారు కానీ 369 కి అర్థం మాత్రం చెప్పలేదు. అయితే 369 అనేది చాలా మందికి ప్రపంచంలో పాజిటివ్ నెంబర్. 3+6 కలిపినా 9 వస్తుంది. ఇక 3 అంటే మార్పు, 6 అంటే కోత ఆరంభం, ఇక 9 అంటే విస్తరించడం అని అర్థమొస్తుందట.
ఇక చాలా మందికి లక్కీ నెంబర్ గా 9 ఉంటుంది. గడియారంలో కూడా 369 అనే నెంబర్ కు సరి సమానమైన కాలాన్ని సూచిస్తుంది. అలా 369 అంటే అంత హిస్టరీ ఉందన్నమాట. అయితే ఈ సినిమా ఇటీవలే 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుంటుందంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవల విడుదల అయి మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాకు కూడా ఆదిత్య 369 సినిమా స్ఫూర్తి అంటూ డైరెక్టర్ వశిష్ట చెప్పడం ఆదిత్య 369 సినిమా గొప్పతనాన్ని చెబుతుంది.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…