Featured

Advocate Udhay Kanth : ఆ నిజాలు బయట పెడతాడనే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు…: అడ్వకేట్ ఉదయ్ కాంత్

Advocate Udhay Kanth : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద రెండేళ్ల జైలు శిక్ష వేయాలనే సూరత్ కోర్ట్ తీర్పుతో ఒక్కసారిగా దేశ రాజాకీయాలు వేడెక్కాయి. ప్రధాని మోడీ పేరును ఉపయోగిస్తూ అవమానకర వాఖ్యలు చేసారనే నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద 2019 లో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువునష్టం దావా వేశారు కాగా నేడు కోర్ట్ తీర్పును ఇచ్చింది. అయితే రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంట్ లో మోడీ, అదాని బందం గురించి మాట్లాడిన తరువాత సూరత్ కోర్ట్ నుండి తీర్పు రావడం పట్ల కక్ష్య పూరిత చర్యగా దీన్ని అభివర్ణిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఒకరోజు సత్యాగ్రహం కూడా తల పెట్టారు. ఇక ఈ విషయం గురించి బీజేపీ నియంత్రత్వ నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు విశ్లేషించారు.

బీజేపీ కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోంది….

2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా కోలార్ సభలో రాహుల్‌ మోడీలకు దోచిపెడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువునష్టం దావా వేశారు. అయితే హైకోర్టులో ఆ కేసు విచారణ చాలారోజుల వరకు పెండింగ్‌లో ఉండగా, తాజాగా లోక్‌సభలో అదానీ అంశంపై విపక్ష నేత రాహుల్‌గాంధీ ఫిబ్రవరి 7న మోదీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ,అదానీ బంధాన్ని ప్రశ్నించారు. దీంతో మోదీ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహారిస్తూ రాహుల్ గాంధీ మీద రెండేళ్ల శిక్ష పడేలా కేసును వాడుకుందని అలా రెండేళ్లు శిక్ష వల్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు అనేది బీజేపీ వ్యూహం అంటూ అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు అభిప్రాయపడ్డారు.

మొదట్లో కేసును ఉపసంహరించుకున్న పిటిషన్‌దారు మోడీ, అదాని బంధం గురించి రాహుల్ లోక్ సభలో మాట్లాడిన అనంతరం సూరత్‌కోర్టును తిరిగి ఆశ్రయించడం పట్ల అనుమానాలు ఉన్నాయంటూ తెలిపారు. ఫిబ్రవరి 27న ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. మార్చి 17న విచారణ ముగించి, తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం, 23న రాహుల్‌కు శిక్షను ఖరారు చేసింది. కేవలం 24 రోజుల్లో విచారణ పూర్తిచేసి శిక్ష ఖరారు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఉదయ్ కాంత్ అభిప్రాయపడ్డారు. తమ పాలనను ప్రశ్నిస్తే ఇలా శిక్షిస్తాం అన్నట్లుగా మోదీ తీరు ఉందని అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

ప్రపంచంలో అత్యధిక బంగారం ఎవరిది?భారత్‌ని మించి అత్యధిక బంగారం ఎవరిదో తెలుసా?

ప్రపంచ ఆర్థిక గణాంకాలను ప్రభావితం చేసే ఒక అంశం “బంగారు నిల్వలు” (Gold Reserves). యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల…

15 minutes ago

పిల్లల పేర్లలో కన్ఫ్యూజన్? సంప్రదాయం, జ్యోతిష్యం, మోడరన్ ట్రెండ్ – ఏది సరైన ఎంపిక?

ఇంట్లో చిన్నారి పుట్టిన క్షణం నుంచి ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు ఒక ముఖ్యమైన చర్చ కూడా…

29 minutes ago

మద్యం వల్లనే కాదు… వీటి వల్ల కూడా లివర్‌ దెబ్బతింటుంది..

కాలేయం (లివర్‌) మన శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటి. శరీరానికి అవసరమైన పోషకాలను ప్రాసెస్ చేయడం, విషపదార్థాలను బయటకు…

59 minutes ago

చిరంజీవి కాదు… ఇండియాలో బెస్ట్ యాక్టర్ అతనే.. రాధికా ఓపెన్ కామెంట్.!

దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రాధికా శరత్ కుమార్ మరోసారి వార్తల్లో…

1 hour ago

7 సీటర్ కారు కొనాలనుకుంటున్నారా? మార్కెట్లోకి కొత్త MPVలు… కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్స్..

ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…

2 hours ago

అమెజాన్‌లో Galaxy S24 – భారీ తగ్గింపు, ఫీచర్లు ఇప్పుడు తెలుసుకోండి

కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్‌ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…

3 hours ago