విడాకులు నాగ చైతన్యకు నిజంగానే కలిసి వచ్చాయా, అంటే అవును అనే సమాధానం చెప్పాల్సిందే.. ఎందుకంటే సమంత స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో నాగ చైతన్య మాత్రం సినిమాల ఫలాప్స్ తో చతికల బడ్డాడు. ఒక రకంగా సమంత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అక్కడ నుంచి హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తూ అక్కినేని ఫ్యామిలీ కి సవాల్ చేసిందనే చెప్పాలి. ఇదే సమయంలో నాగ చైతన్య కి సరైన హిట్స్ లేకపోవడం కూడా అక్కినేని ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయం. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య సమంత తమ విడాకులు అనౌన్స్ చేసారో అప్పటి నుంచి నాగ చైతన్య కెరీర్ లో జెట్ స్పీడ్ వేగం తో పాటు సరైన ట్రాక్ లో పడ్డట్టుగా కూడా కనిపిస్తుంది. అది ఎలాగో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్ధం అవుతుంది.
అక్కినేని నటవారసుడిగా సినిమాలో అడుగు పెట్టిన నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య ఇప్పుడిప్పుడే మంచి జోష్ లో కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. ఏమాయ చేసావె సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న చై అక్కినేని. ఈ సినిమాలో తన పక్కన హీరోయిన్ గా సమంత నటించింది. ఈ చిత్రం తర్వాత 100% లవ్, తడాఖా, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాలో ఫర్వాలేదు అనిపించాడు చైతన్య.. ఇదే సమయంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పటడుగులు వేయడంతో దాదాపు అన్ని ఫ్లాప్స్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీంతో నాగ చైతన్య వరుస విజయాలు అందుకుంటున్నాడు.
నాగ చైతన్య నటించిన వరుస నాలుగు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. చైతూ తన మేనమామ అయినా వెంకటేష్ తో కలిసి వెంకీమామ అనే సినిమా లో నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన మజిలీ సినిమా తో సమంత తో కలిసి నటించగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. అటు కరోనా తర్వాత సాయి పల్లవి హీరోయిన్ గా నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ కూడా విడుదల అయ్యి మంచి హిట్ అయ్యింది. ఇక తాజాగా తండ్రి నాగార్జున తో కలిసి చేసిన మూవీ బంగార్రాజు కూడా సంక్రాంతి బరిలో నిలిచి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాడు.
అటు తన తర్వాత సినిమాల విషయంలోనూ నాగ చైతన్య ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. 2022 లో మంచి సినిమాలను నాగ చైతన్య నుంచి ఎదురు చూడచ్చు అక్కినేని ఫ్యాన్స్. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో కలిసి థ్యాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. అటు అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. అటు అమెజాన్ ప్రైమ్ కోసం ఓ హార్రర్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు చై. ఇందులో నాగ చైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కనబరుస్తున్న ఈ దూకుడు చూస్తుంటే.. మరికొద్ది రోజుల్లోనే టాప్ హీరో స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తాత, తండ్రికి తగ్గ నటుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉందంటున్నారు సినీ జనాలు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…