Aishwarya – Abhishek: బాలీవుడ్ ఇండస్ట్రీలో చూడ ముచ్చటగా కనిపించే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ గురించి తెలియని వారంటూ ఉండరు. 2007లో వీరిద్దరూ వివాహం చేసుకోగా 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అందరి సెలబ్రిటీల లాగే వీరి వివాహ బంధం గురించి అనేక రూమర్లు వినిపించాయి. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా మరొకసారి ఐశ్వర్య – అభిషేక్ విడాకులు వార్త వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవ్వటానికి కారణాలు లేకపోలేదు. వివాహం తర్వాత ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఎక్కడికి వెళ్లినా జంటగా కలిసి వెళ్లేవారు. కానీ గత కొంతకాలంగా ఐశ్వర్య అభిషేక్ జంటగా ఏ కార్యక్రమానికి వెళ్లిన సందర్భాలు లేవు. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒంటరిగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతుంది. ఇటీవల నిర్వహించిన మిగతా అంబానీ కల్చరల్ ఈవెంట్లో కూడా ఐశ్వర్య కూతురితో పాటు హాజరయ్యింది.
మిగిలిన బాలీవుడ్ సెలబ్రిటీలు జంటలుగా హాజరైతే ఐశ్వర్య మాత్రం కూతురితో కలిసి ఒంటరిగా ఈ ఈవెంట్ కి హాజరు అయ్యింది. దీంతో ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు మరొక సారి చక్కర్లు కొడుతున్నాయి.
ఐశ్వర్య, అభిషేక్ మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా ఐశ్వర్య కూతురితో కలిసి అభిషేక్ కి దూరంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఎక్కడికి వెళ్ళినా కూడా అభిషేక్ తోడుగా లేకుండా ఐశ్వర్య కూతురుతో కలిసి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విడాకుల వార్తలపై ఈ సెలబ్రిటీ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. గతంలో వచ్చిన విడాకుల వార్తల గురించి అభిషేక్ స్పందిస్తూ.. “నేను విడాకులు తీసుకుంటున్నట్లు నాకు గుర్తు చేసినందుకు థాంక్స్.. నా రెండవ పెళ్లి కూడా ఎప్పుడు చేస్తున్నారో మీరే చెప్పండి” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వస్తున్న ఈ వార్తలపై అభిషేక్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…