Movie News

Indraja: జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ…మీ ఓవరాక్షన్ ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్న నేటిజన్స్!

Indraja: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ఎంత మంచి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఎప్పటిలాగే తమ అద్భుతమైన స్కిట్లు చేస్తూ అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వెంకీరమేష్ నేను మంచోడిన నేను మంచోడినా అంటూ తన తండ్రి కృష్ణ భగవాన్ వద్దకు వెళ్లి అడగడంతో మీ ఇద్దరి కన్నా నేను మంచోడిని అంటూ పంచ్ వేశాడు.మీ ఇద్దరు ఎలాంటి వారో తెలిసి కూడా మీకు స్కిట్ చేసే అవకాశం ఇచ్చాను అని చెప్పడంతో అక్కడున్న వారందరూ నవ్వుతారు. అనంతరం వెంకీ మాట్లాడుతూ మీ బాధ చూడలేక మీకోసం ఒక పని మనిషిని తీసుకు వచ్చానని చెప్పడంతో వెంటనే కృష్ణ భగవాన్ ఏది రమ్మని చెప్పు అనగా ఒక అమ్మాయి రావడం తనతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ సెటైర్లు వేయడం చేశారు.

ఇలా అంతా బాగా ఉన్నప్పటికీ ఈ స్కిట్ కు ఇంద్రజ మార్పులు ఇస్తూ 9 మాత్రమే ఇచ్చారు. అందుకు వెంకి మాట్లాడుతూ పది ఇవ్వచ్చు కదా మేడం అని అడిగారు.పది ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారని అడగలేదు అంటూ ఇంద్రజ చెప్పగా అప్పుడు బాగా చేశామని వెంకీ చెప్పారు.ఇప్పుడు అంతకన్నా కాస్త తక్కువగా చేశారు కనుక తొమ్మిది ఇచ్చాను కృష్ణ భగవాన్ గారు కూడా తొమ్మిదో ఇచ్చారు మరి ఆయనని అడగండి అంటూ అక్కడి నుంచి ఆమె లేచి వెళ్ళిపోయారు.

Indraja: రేటింగ్స్ కోసం ఓవరాక్షన్ అవసరమా…

ఇలా ఈ ప్రోమోలో ఇంద్రజ వెంకీ టీం తో గొడవపడి అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమో చూసిన నేటిజన్స్ దారుణంగా ఇంద్రజ పై ట్రోల్ చేస్తున్నారు. అమ్మ ఇంద్రజ ఇకనైనా మీ ఓవరాక్షన్ ఆపండి.ప్రతివారం విడుదల చేసే ప్రోమోలో మీరు సీట్లో నుంచి వెళ్లిపోవడం మమ్మల్ని ఎదవల్ని చేయడం. రేటింగ్ కోసం ఈ ట్రిక్స్ ఇకనైనా మానుకోండి చూడలేక చస్తున్నాం అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago