Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టి నాగచైతన్యతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే సమంత నాగచైతన్య విడిపోయినప్పటికీ సమంత మాత్రం అక్కినేని కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పరచుకుందని చెప్పాలి.
ఇలా నాగచైతన్యకు దూరంగా ఉన్నటువంటి సమంత అఖిల్ తో ఈమెకు మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఇలా ఆయన సినిమాలు విడుదలయ్యే సమయంలోను అలాగే తన పుట్టినరోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ అయిన రానా ఆశ్రిత మిహీకా వంటి వారితో కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా ముచ్చట్లు పెడుతూ ఉంటారు.
తాజాగా అఖిల్ తన 29వ పుట్టినరోజును జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే అఖిల్ అక్కినేని. ఎయ్… ఏజెంట్ 28వ తేదీన రాబోతోంది.. చూస్తుంటే ఫైర్ లా ఉంది లాట్సాఫ్ లవ్ అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలా సమంత సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పలువురు నెటిజన్ సమంతకు మరిది అంటే అంత ప్రేమ నా అంటూ కామెంట్లు చేశారు. అయితే గత ఏడాది కూడా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా ఈయన మాత్రం రిప్లై ఇవ్వలేదు మరి ఈసారైనా సమంత పోస్టుకు రిప్లై ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…