Categories: FeaturedMovie News

Balagam director Venu : కొట్టారు, తిట్టారు, అవమానించారు… అన్నీ భరించా…: బలగం డైరెక్టర్ వేణు

Balagam director Venu : కమెడియన్ గా సినిమాల్లో ప్రయాణం మొదలు పెట్టి నేడు తెలుగు ప్రేక్షకుల మనసు హత్తుకునేలా సినిమా తీసిన డైరెక్టర్ వేణు. కమెడియన్ వేణు నుండి డైరెక్టర్ వేణు గారు వరకు తన ప్రయాణం, తాను పడిన కష్టాలు ఇబ్బందులు త్యాగాలు అన్నింటినీ బలగం సినిమా సక్సెస్ అయ్యాక అందరి ప్రశంసలతో మర్చిపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన వేణు యెల్దండి తన బలగం సినిమా ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ఎలా ఆదరిస్తున్నారు, తనకు వస్తున్న వేలాది రివ్యూల గురించి ఇంటర్వ్యూలో తెలిపారు వేణు అలాగే తన బలగం సినిమా ప్రయాణం మొదటి అడుగు నుండి ఎలా పడిందో ఇంటర్వ్యూలో వివరించారు.

అవమానించిన భరించా…

వేణు తన ఇరవై ఏళ్ల సినిమా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. కష్టపడినా అదృష్టం కూడా కలిసి రావాలని, అది నాకు రాలేదని, అలా వచ్చుంటే ప్రభాస్ తో నటించిన మున్నా సినిమా, రామ్ పోతినేని తో జగడం, పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలు హిట్ అయ్యుంటే కమెడియన్ గా మంచి ప్లేసులోకి వెళ్లుండేవాడిని కానీ అలా జరుగలేదు.

బలగం లాంటి ఒక విజయం నాకు రావడానికి నాకు ఇరవై ఏళ్ళు పట్టింది అంటూ తెలిపారు. ఇక జబర్దస్త్ లో ఒక స్కిట్ వేసినపుడు జరిగిన వివాదం తనని కొట్టడం గురించి మాట్లాడుతూ ఆ నాడు ఇండస్ట్రీలో చాలా మంది నాకు సపోర్ట్ గా నిలబడ్డారు అని తెలిపారు. అలాంటివన్నీ భరించి వచ్చినందుకు దేవుడు నాకు ఇంతటి విజయాన్ని ఇచ్చాడేమో అనిపిస్తుంది అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago