Kajal introduces her son in the occasion of Mother ‘s day : లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో నటించిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. దాదాపుగా టాలీవుడ్ లో అందరి హీరోల సరసన నటించింది.
సినిమాల్లో హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ని ప్రేమ వివాహం చేసుకుంది. కరోనా సమయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాలలోనూ వెబ్ సిరీస్ ల లోను నటించింది కానీ ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రం సినిమాలకు దూరమైంది. ఇక తాజాగా కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి కూడా తెలిసిందే.
ఇటీవలే కాజల్ అగర్వాల్ తన బిడ్డకు నీల్ కిచ్లు అని నామకరణం కూడా చేసింది. అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన కొడుకుతో మాతృత్వాన్ని ఆస్వాధీస్తోంది. అయితే ఇది వరకే కాజల్ అగర్వాల్ డెలివరీ తరువాత తన కొడుకు ఫోటోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మదర్స్ డే ని పురస్కరించుకుని కాజల్ తన కొడుకు ఫోటోలను పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
మదర్స్ డే సందర్బంగా అభిమానులతో కాజల్ ఆనందం….
తాజాగా కాజల్ అగర్వాల్ మదర్స్ డే సందర్భంగా తన కొడుకు నీల్ కిచ్లు ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. కుటుంబసభ్యులు అందరు నిషా అగర్వాల్, ఆమె కొడుకు సహా నీల్‌ను ఎత్తుకొని ముద్దుచేస్తు వున్న ఫోటోలను కాజల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందార్భన్ని పురస్కరించుకొని తొలిసారి తల్లైన కాజల్‌కు సెలబ్రిటీలు సహా నెటిజన్లు, అభిమానులు మథర్స్ డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన కొడుకు నీల్ కిచ్లు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…