Categories: FeaturedMovie News

Ajay Ghosh : ధన్ రాజ్, ప్రవీణ్ లు అర్ధరాత్రి ఫోన్ చేసి చిలిపి చేష్టలు చేస్తారు… కోట శ్రీనివాసరావు అసలు కనిపించరు : అజయ్ ఘోష్

Ajay Ghosh : 2010వ సంవత్సరంలో విడుదల అయిన ‘ప్రస్థానం’ సినిమా ద్వారా సినిమాలకు పరిచయం అయ్యాడు అజయ్ ఘోష్. తరువాత రన్ రాజా రన్, జ్యోతి లక్ష్మి, బహుబలి 2, భాగమతి, రంగస్థలం వంటి సినిమాలలో నటించి అభిమానులకు చేరువ అయ్యారు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని ‘కొండా రెడ్డి’ పాత్రతో ఆకట్టుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అజయ్ ఘోష్ అలరించాడు. అయితే తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తనకు సంబందించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అమ్మాయిల గొంతుతో అర్ధరాత్రి ఫోన్ చేస్తారు…

ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన గుండు గురించి ప్రస్తావించగా, మా పెద్దబ్బాయి జతలో ఇంగ్లీష్ సినిమాలు చూసి నాకంటూ కూడా ఒక ప్రత్యేకత ఉండాలని చేయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక సెట్ లో అయినా ఎక్కడైనా నేను ఒకేలాగే ఉంటానని, అలానే ఉన్నా కూడా నాకంటూ ఆప్యాయ్యంగా పలకరించే వారు ఉన్నారని చెప్పారు. సునీల్, ప్రవీణ్, ధన్ రాజ్ లాంటి వాళ్ళు నాతో సన్నిహితంగా ఉంటారని, ధన్ రాజ్, ప్రవీణ్ ఏకంగా అర్ధరాత్రి నాకు అమ్మాయి గొంతుతో ఫోన్ చేసి ఆటపాట్టిస్తారని చెప్పుకొచ్చారు.

ఇక కోటా శ్రీనివాస రావు గారు అంటే మీకెందుకు అంత అభిమానం అన్న ప్రశ్నకు.. నా దృష్టిలో ఆయన ఒక లెజెండ్ అని చెప్పారు. ఏదైనా పాత్ర చేస్తే కోటా శ్రీనివాసరావు గారు కనిపించరు, ఆ పాత్ర మాత్రమే మనకు కనిపిస్తుంది. నటనలో అయన నీడను నేను చేరుకున్నా, నేను చాలా గొప్ప నటుడు అయ్యాను అని భావిస్తాను. ఆయనను చూసి నేను చాలా ప్రభావితున్ని అయ్యాను. అని కోటా మీద తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చారు. అజయ్ ఘోష్ తెలుగు తో పాటు తమిళ్, కన్నడ సినిమాలలో కూడా నటించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago