Pranathi -Anjana: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున వారి సినిమాలకు సంబంధించిన విషయాలను వారి ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక నటీనటులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏకంగా సెలబ్రిటీ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు.
అయితే ఇలాంటి వాటికి ఎన్టీఆర్ కుటుంబం కాస్త దూరంగానే ఉంటుందని చెప్పాలి.ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కేవలం ఆయనకు సంబంధించిన సినిమా విషయాలను మాత్రమే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈయన భార్య ప్రణతి ఇక సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉంటారు.
ఎప్పుడైనా కుటుంబంతో కలిసి వెకేషన్ వెళితే ఆ ఫోటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారే తప్ప లక్ష్మీ ప్రణతి మాత్రం ఎక్కడ తన విషయాలను చర్చించరు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి నాని భార్య అంజనాతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఇలా ఈ హీరోలు ఇద్దరు భార్యలను ఒకే చోట చూడడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాని భార్య అంజనా, ప్రణతి ఇద్దరూ కూడా రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిలో కలిశారట. ఈ పెళ్లిలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం స్నేహంగా మారింది. దీంతో అప్పటినుంచి వీరిద్దరూ తరచూ కలుస్తూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ వీరి స్నేహితులతో కలిసి సందడి చేసినటువంటి ఫోటోలను నాని భార్య అంజన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…