Akhil Akkineni : అక్కినేని కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ లో గొప్ప గౌరవం, పేరు ఉన్నాయి. నాగేశ్వరావు గారి లేగసీని అక్కినేని నటవారసుడిగా నాగార్జున నిలబెట్టారు. ఏ రోజూ తండ్రి కి తలవంపులు తెచ్చే పని చేయలేదు. ఇండస్ట్రీ లో వారసత్వంతో అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ను సృష్టించుకుని అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగారు. అలాంటి నాగార్జునకు ఇద్దరు కొడుకులు తలనొప్పిగా మారారు. నాగేశ్వరావు గారి తరువాత నాగార్జున గారు సక్సెస్ అయ్యారు అలా నాగచైతన్య, అఖిల్ సక్సెస్ కాలేక పోతున్నారు. మంచి హిట్లు ఇంతవరకు వారిద్దరి ఖాతాల్లో లేవు. ఇంకా మార్కెటింగ్ ను పెంచుకోడానికి కస్టపడుతూనే ఉన్నారు.
కొత్త తలనొప్పి తెచ్చి పెట్టిన అఖిల్…
ఇటీవలే నాగచైతన్య, సమంత విడిపోయి సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అయ్యారు. కారణాలు తెలియకపోవడంతో అసలు వీళ్ళు విడిపోడానికి కారణాలు ఏంటో అని రకరకాలుగా కథనాలు రాసేసుకుని నాగ చైతన్య కి అఫైర్స్ ఉన్నాయి అది ఇది అంటూ రచ్చ చేసారు. ఇక ఇవన్నీ సద్ధుమణిగి మళ్ళీ వాళ్ళ సినిమాల మీద ఫోకస్ చేసినా మంచి హిట్స్ అందుకోలేదు నాగచైతన్య. చైతూ అన్నా కొంచెం బెటర్ ఇక అఖిల్ సంగతి మరింత తలనొప్పిలా మారింది నాగార్జునకి. ఇంక మొదటి సినిమాతో వచ్చి హిట్ కొట్టకపోయినా పర్వాలేదు అబ్బాయి అనే లోపు ప్రేమ పెళ్లి అంటూ హడావిడి చేసి చివరకు ఎంగేజ్మెంట్ చేసుకుని దాన్ని కాస్త రద్దు చేసుకొని వార్తల్లోకి ఎక్కాడు మనోడు.
ఇక సినిమాలన్నా కొంచెం హిట్ అవుతున్నాయా అంటే ఎపుడు వస్తున్నాయో ఎపుడు పోతున్నాయో అన్నట్లు ఉంది. ప్రస్తుతం అఖిల్ బాగా కష్టపడి కండలు పెంచి మరీ వస్తున్న థ్రిల్లర్ సినిమా ‘ఏజెంట్’ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అసలే నాగార్జున కొడుకులు ఇద్దరినీ సినిమాల్లో సెటిల్ చేయాలని తెగ తంటాలు పడుతుంటే అఖిల్ మళ్ళీ నాగార్జున కి తలనొప్పి తెచ్చాడంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అఖిల్ పబ్ లో ఫుల్ గా మద్యం తాగి అక్కడ ఉన్న ఒక వ్యక్తితో రూడ్ గా ప్రవర్తించాడట, ఈ వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…