ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు 10,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 2,000 లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగన్ సర్కార్ స్కూళ్ల రీ-ఓపెన్ షెడ్యూల్ లో కీలక మార్పులు చేసింది.
మొదట విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉండగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే క్లాసులు ప్రారంభించే విధంగా నిబంధనల్లో మార్పులు చేశామని అన్నారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం `1.30 గంటల వరకు క్లాసులను నిర్వహిస్తామని తెలిపారు.
6, 7 తరగతుల విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నుంచి క్లాసులను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 8,9 తరగతుల విద్యార్థులకు మాత్రం రోజు విడిచి రోజు క్లాసులను నిర్వహించనున్నట్టు తెలిపారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి పండగ సెలవుల తర్వాత క్లాసులను నిర్వహిస్తామని అన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలల నిర్వహణ చేపడతామని తెలిపారు.
తరగతి గదుల్లో విద్యార్థులు మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేయనున్నామని అన్నారు. మారిన నిబంధనల ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రారంభమైన స్కూళ్లలో పలు చోట్ల విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…