Ali Daughter: ఘనంగా అలీ కుమార్తె ఫాతిమా హల్దీ వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Ali Daughter: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా సినిమాలు బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా నిశ్చితార్థం గత కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇకపోతే ఈమె పెళ్లి దగ్గర పడటంతో ఇప్పటికే దంపతులు అందరికీ శుభలేఖలను పంచుతూ పెళ్లి పనులలో బిజీ అయ్యారు. ఇక వీరి కుమార్తె మొదటి శుభలేఖను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సతి సమేతంగా వెళ్లి ఆహ్వానించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ తో పాటు చిరంజీవి కుటుంబానికి కూడా ఆలీ దంపతులు వెళ్లి వారి కుమార్తె వివాహానికి ఆహ్వానించారు.


Ali Daughter: హాజరుకానున్న సినీ రాజకీయ ప్రముఖులు…

ఇక ప్రస్తుతం ఆలీ ఇంట తన కూతురు పెళ్లి వేడుకలు మొదలైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే తన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో తమ కుమార్తె హల్దీ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినట్టు సోషల్ మీడియా వేదికగా ఆలీ భార్య జుబేదా తెలియజేశారు. ఈ క్రమంలోనే అలీ భార్య పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు ఒకరికొకరు పసుపు రాసుకుంటూ ఎంతో సంతోషంగా ఈ వేడుకను జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె వివాహం దగ్గర పడటంతో అలీ పెళ్లి పనులలో బిజీ ఉన్నారు. ఇక ఈమె పెళ్ళికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం.