Featured

Ali – Prakash Raj: ఎంపీ రేసులో ఉన్న అలీ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్..?

Ali – Prakash Raj: ప్రస్తుతం పెద్దల సభ రాజ్యసభ నుంచి నలుగురు ఎంపీలు పదవీ విరమణ పొందడంతో ఎంపీ పదవులకోసం పలువురు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ రేసులో నటుడు అలీ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేర్లు బలంగా వినబడుతున్నాయి.ఇక వీరిద్దరి పేర్లు దాదాపు ఖరారు కావడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Ali – Prakash Raj: ఎంపీ రేసులో ఉన్న అలీ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్..?

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సుదీర్ఘ కాలం నుంచి ఎంతో చురుగ్గా ఉన్నటువంటి నటుడు అలీ గత ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పార్టీకి తన మద్దతు తెలియజేశారు.ఈ క్రమంలోనే అలీకి పార్టీ నుంచి ఒక కీలకమైన పదవి వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు.

Ali – Prakash Raj: ఎంపీ రేసులో ఉన్న అలీ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్..?

ఇలా ఏపీ ప్రభుత్వంతో చలన చిత్ర పరిశ్రమకు ఉన్న సమస్యను పరిష్కరించడం కోసం సినీ పెద్దలు ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో కూడా పార్టీ తరఫున ఈ సమావేశానికి హాజరయ్యారు.ఇలా ఆహ్వానం లేకుండా అలీ అక్కడ కనిపించడంతో ఆయన పార్టీ పరంగా ఈ సమావేశానికి హాజరయ్యారు అని అందరూ భావించారు.

త్వరలో అధికారిక ప్రకటన…

ఇక సినీ పెద్దలతో ముఖ్యమంత్రి సమావేశం జరిగిన కొద్ది రోజులకే ఆలీ అతని భార్య జుబెదా ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిని కలిశారు.ఇలా ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి శుభవార్త అందుతుందని తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మైనారిటీ కేటగిరిలో అలీ రాజ్యసభకు వెళ్తున్నట్లు క్లారిటీ వచ్చింది. ఇక తెలంగాణలో కూడా కెసిఆర్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రకాష్ రాజ్ రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి ఎంపీ రేసులో ప్రకాష్ రాజ్ పేరు వినబడుతుంది. త్వరలోనే ఈ విషయం గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అధికారికంగా తెలియజేయనున్నారని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పాత సిమ్ కార్డుల నుంచి 28 లక్షల బంగారం! కొత్త రికార్డ్ ఎక్కడంటే..!

చైనాలో సిమ్ కార్డుల నుంచి బంగారం – నెటిజన్ల ఆశ్చర్యం చైనాలోని క్యో అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో…

27 minutes ago

లీటర్ పెట్రోల్ కేవలం రూ.2! ఏ దేశాల్లో లభిస్తున్నాయో తెలుసా?

ప్రపంచంలో అత్యంత చవక పెట్రోల్, భారత్ పరిస్థితి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని సంవత్సరాల్లో భూకంపంలా పెరుగుతున్నాయి.…

53 minutes ago

ప్రేమకే రికార్డ్ సెట్ చేసిన లవర్..ఒక్క రోజుకు 25,000 రూపాయల ఆర్డర్లు!

ప్రేమికుల రోజు: గిఫ్ట్‌లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…

1 hour ago

BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు – భద్రతా చర్యలు ముమ్మరం

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…

2 hours ago

కేజీ వెండి ధర కుప్పకూలింది.. దేశవ్యాప్తంగా ఒకేసారి భారీ తగ్గుదల!

వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…

2 hours ago

హలీం.. రంజాన్ సీజన్‌లో ఆరోగ్య బోనస్! దీని ప్రయోజనాలు తెలుసుకున్నా వదలలేరు..

రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…

2 hours ago