Ali shared funny rumour about his secret marriage with heroine : తెలుగు స్టార్ కమెడియన్ గా ఆలీ బాలనటుడిగా మొదలై ఎన్నో సినిమాలలో హాస్యంతో అందరిని నవ్వించారు. ఇంకా నవ్విస్తూనే ఉన్నారు. అలాంటి ఆలీని ఓ మ్యాగ్ జైన్ లో వచ్చిన పుకారు బాగా ఇబ్బంది పెట్టిందట. ఇటీవలే ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీ తో సరదాగా షోలో ఈ విషయాన్నీ పంచుకున్నారు ఆలీ. ఈ షోకి అతిధిగా అలనాటి తార శుభశ్రీ వచ్చారు. శుభశ్రీ, కన్నడ సూపర్ స్టార్ మాలశ్రీ చెల్లెలు.శుభశ్రీ అసలు పేరు భారతి పాండే సినిమాల్లోకి వచ్చాక పేరు శుభశ్రీ గా మార్చుకున్నారు.
1993 తమిళ్ హీరో ప్రశాంత్ హీరోగా వచ్చిన ఇంగతుంబి సినిమాతో ఆమె వెండి తెరపై తొలిసారిగా మెరిసింది. ఆ తర్వాత తెలుగులో తొలిసారిగా అందరూ అందరే అనే సినిమా చేసింది. గ్యాంగ్ మాస్టార్,పుణ్య భూమి నా దేశం, పెదరాయుడు, పోకిరి రాజా అంటూ వరుసగా అనే తెలుగు సినిమాల్లో కూడా శుభశ్రీ నటించింది. తెలుగులోనే కాదు తమిళ, మళయాళం, కన్నడంలో కూడా శుభశ్రీ సినిమాలు చేసింది.14ఏళ్ల కే సినిమాల్లో అడుగుపెట్టిన శుభశ్రీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.
ఆలీ, శుభశ్రీల పెళ్లి పుకారు…
వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక ఆలీ గారు తనకు జరిగిన సరదా సంఘటనను ఈ సందర్బంగా చెప్పారు. ఆలీ శుభశ్రీ ఐదారు సినిమాల్లో కలిసి నటించారు. దీంతో వీరిపై పుకార్లు మొదలయ్యాయి. ఇక ఒక సినిమాలో పెళ్లి సీన్ ఉండటంతో పెళ్లి గెటప్ లో ఉన్నా వారిని ఫోటో తీసి ఒక మ్యాగ్జైన్ వాళ్ళు వారికి పెళ్లయింది అని రాసేసి ఫోటోను వేసేశారట.
అదే సమయంలో అలీ భార్య పుట్టింటికి వెళ్లేందుకు రైలెక్కింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అలీ మామగారు సదరు మ్యాగ్ జైన్ కొన్నారు. రైలులో కూర్చొని చదువుతుండగా అలీ గురించి రాసిన వార్త కంట పడింది ఇక రైలులో ఆ విషయం చెప్పకుండ రైలు దిగగానే అలీ భార్యకు నీ భర్తకు మరో పెళ్లి జరిగిందని చెప్పారు.
ఈ విషయం తెలిసిన అలీ భార్య అదే రోజు సాయంత్రం రైలెక్కి తిరిగి అత్తారింటికి వెళ్లింది. దీంతో పుట్టింటికి వెళ్లిన కోడలు అపుడే తిరిగి రావడం చూసిన అలీ తల్లి ఏమైందని ఆరా తీశారు. అలీ, శుభశ్రీ పెళ్లి జరిగిందని బోరున ఏడ్చిందట ఆలీ భార్య దీంతో అలీ వచ్చి అలాంటిదేం లేదని భార్యకు, మామగారికి నచ్చజెప్పి,శుభశ్రీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని.. అది సినిమాలో షూటింగ్‌కు సంబంధించిన ఫోటో అంటూ అలీ భార్యకు వివరించారట. అయితే ఈ పుకారుకు సంబంధించిన విషయం తనకు అసలు తెలియదని శుభశ్రీ చెప్పడం కొసమెరుపు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…