Featured

Comedian Ali : ఆ హీరోయిన్ తో పెళ్లయిందని అలీపై పుకార్లు.. ఏడ్చేసిన అలీ భార్య…!

Ali shared funny rumour about his secret marriage with heroine : తెలుగు స్టార్ కమెడియన్ గా ఆలీ బాలనటుడిగా మొదలై ఎన్నో సినిమాలలో హాస్యంతో అందరిని నవ్వించారు. ఇంకా నవ్విస్తూనే ఉన్నారు. అలాంటి ఆలీని ఓ మ్యాగ్ జైన్ లో వచ్చిన పుకారు బాగా ఇబ్బంది పెట్టిందట. ఇటీవలే ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీ తో సరదాగా షోలో ఈ విషయాన్నీ పంచుకున్నారు ఆలీ. ఈ షోకి అతిధిగా అలనాటి తార శుభశ్రీ వచ్చారు. శుభశ్రీ, కన్నడ సూపర్ స్టార్ మాలశ్రీ చెల్లెలు.శుభశ్రీ అసలు పేరు భారతి పాండే సినిమాల్లోకి వచ్చాక పేరు శుభశ్రీ గా మార్చుకున్నారు.

1993 తమిళ్ హీరో ప్రశాంత్ హీరోగా వచ్చిన ఇంగతుంబి సినిమాతో ఆమె వెండి తెరపై తొలిసారిగా మెరిసింది. ఆ తర్వాత తెలుగులో తొలిసారిగా అందరూ అందరే అనే సినిమా చేసింది. గ్యాంగ్ మాస్టార్,పుణ్య భూమి నా దేశం, పెదరాయుడు, పోకిరి రాజా అంటూ వరుసగా అనే తెలుగు సినిమాల్లో కూడా శుభశ్రీ నటించింది. తెలుగులోనే కాదు తమిళ, మళయాళం, కన్నడంలో కూడా శుభశ్రీ సినిమాలు చేసింది.14ఏళ్ల కే సినిమాల్లో అడుగుపెట్టిన శుభశ్రీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.

ఆలీ, శుభశ్రీల పెళ్లి పుకారు…

వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక ఆలీ గారు తనకు జరిగిన సరదా సంఘటనను ఈ సందర్బంగా చెప్పారు. ఆలీ శుభశ్రీ ఐదారు సినిమాల్లో కలిసి నటించారు. దీంతో వీరిపై పుకార్లు మొదలయ్యాయి. ఇక ఒక సినిమాలో పెళ్లి సీన్ ఉండటంతో పెళ్లి గెటప్ లో ఉన్నా వారిని ఫోటో తీసి ఒక మ్యాగ్జైన్ వాళ్ళు వారికి పెళ్లయింది అని రాసేసి ఫోటోను వేసేశారట.

అదే సమయంలో అలీ భార్య పుట్టింటికి వెళ్లేందుకు రైలెక్కింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అలీ మామగారు సదరు మ్యాగ్ జైన్ కొన్నారు. రైలులో కూర్చొని చదువుతుండగా అలీ గురించి రాసిన వార్త కంట పడింది ఇక రైలులో ఆ విషయం చెప్పకుండ రైలు దిగగానే అలీ భార్యకు నీ భర్తకు మరో పెళ్లి జరిగిందని చెప్పారు.

ఈ విషయం తెలిసిన అలీ భార్య అదే రోజు సాయంత్రం రైలెక్కి తిరిగి అత్తారింటికి వెళ్లింది. దీంతో పుట్టింటికి వెళ్లిన కోడలు అపుడే తిరిగి రావడం చూసిన అలీ తల్లి ఏమైందని ఆరా తీశారు. అలీ, శుభశ్రీ పెళ్లి జరిగిందని బోరున ఏడ్చిందట ఆలీ భార్య దీంతో అలీ వచ్చి అలాంటిదేం లేదని భార్యకు, మామగారికి నచ్చజెప్పి,శుభశ్రీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని.. అది సినిమాలో షూటింగ్‌కు సంబంధించిన ఫోటో అంటూ అలీ భార్యకు వివరించారట. అయితే ఈ పుకారుకు సంబంధించిన విషయం తనకు అసలు తెలియదని శుభశ్రీ చెప్పడం కొసమెరుపు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago