Featured

Allu Aravind: బాలయ్య ముక్కుసూటి మనిషి.. ఆయనకు అందరూ అభిమానులే అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

Allu Aravind: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ ఈ మధ్యకాలంలో నందమూరి నటసింహం బాలకృష్ణతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ బాలయ్యను ఏకంగా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తీసుకువచ్చారు. అదేవిధంగా తన కుమారుడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారని తనతో ఐదు నిమిషాలలో పని పూర్తవుతుందని తెలిపారు.అన్ స్టాపబుల్ కోసం తనకు ఫోన్ చేసి మీరు వ్యాఖ్యతగా ఉండాలి అని అడిగాను. వెంటనే టీం పంపించండి అని చెప్పారు.ఇలా తన టీం వెళ్లి అన్ని వివరించిన తర్వాత ఓకే తనకు టీం నచ్చింది మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం అని ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఓకే చెప్పారు.

ఇక శిరీష్ సినిమా వేడుక కోసం బాలయ్యను ఆహ్వానించగా మన శిరీష్ కదా తప్పకుండా వస్తా అంటూ ఈ సినిమా వేడుకకు వచ్చారని అల్లు అరవింద్ వెల్లడించారు. ఈయన ఏ విషయాన్ని దాచుకోరని ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారని , ఆయనకు స్టార్ హీరో అనే అహం లేదంటూ అరవింద్ పేర్కొన్నారు.

Allu Aravind: సింపుల్ ఆటిట్యూడ్…

ఈ విధంగా సింపుల్ యాటిట్యూడ్ చూపించే బాలకృష్ణకు అందరూ అభిమానులే అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్,బాలకృష్ణ మధ్య మంచి రిలేషన్ ఏర్పడటంతో గీతా ఆర్ట్స్ బ్యానర్లు బాలయ్యతో సినిమా చేయడానికి అల్లు అరవింద్ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago