Allu Aravind: తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయ మెరుగని దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఆస్కార్ అవార్డును కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో తెలుగు సినిమా నిర్మాత మండలి చిత్ర బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సినిమా గురించి ఈ సినిమాలో నటీనటుల గురించి పలు విషయాలను తెలియచేశారు. ఆస్కార్ అవార్డు మనకు అందని ద్రాక్ష వంటిదే.అయితే తాను గత కొన్ని సంవత్సరాల క్రితం డబ్బు పెట్టి మరి ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లానని అక్కడ వారందరిని చూసి చాలా సంతోషపడ్డానని తెలిపారు.
ఇలా ఒక అంతర్జాతీయ వేదికపై రాజమౌళి అండ్ టీం ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. రాజమౌళి చంద్రబోస్ కీరవాణి నా మేనల్లుడు రామ్ చరణ్, లవ్లీ హీరో ఎన్టీఆర్ ఇలా వీరందరిని ఆస్కార్ వేదికపై చూస్తే నా కడుపు నిండిపోయింది. ఇక కీరవాణి గారితో నాకు క్షణక్షణం సినిమా నుంచి మంచి అనుబంధము ఉందని తెలిపారు.
తాను రాజమౌళి దర్శకత్వంలో నిర్మాతగా మగధీర సినిమాను చేశాను.ఇకపై రాజమౌళి దర్శకత్వంలో తాను ఫలానా సినిమా చేశాను అని చాలా గర్వంగా చెప్పుకుంటాను అంటూ ఈ సందర్భంగా రాజమౌళి గురించి అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో నటించిన హీరోలను రామ్ చరణ్ నా మేనల్లుడు అని ఎన్టీఆర్ ను లవబుల్ హీరో అంటూ సంబోధించడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…