Featured

Senior actress Baby Rani : నాకు శోభన్ బాబు గారు స్థలం కొనుక్కోమని సలహా ఇచ్చారు… ఇప్పుడు దాని విలువ కోట్లలో ఉంది…: నటి బేబీ రాణి

Senior actress Baby Rani : రాణి రుద్రమ దేవిగా సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి బేబీ రాణి గా బాగా పేరు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా బేబీ రాణి అనగానే అలనాటి ఆ నటిని గుర్తుపడతారు. ఎన్నో సినిమాల్లో చిన్నారిగా అలరించిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషలలో నటించారు. ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా తన కెరీర్ అలాగే తాను నటించిన పలువురు హీరోల గురించి తెలిపారు.

శోభన్ బాబు గారే సలహాలు ఇచ్చారు…

తెలుగులో ‘బంగారు తిమ్మరాజు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బేబీ రాణి గారు శోభన్ బాబు గారి బంగారు పంజరం, బలిపీఠం వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. బంగారు పంజరంలో కూతురుగా నటించిన ఆమె బలిపీఠం సినిమా సమయానికి ఆయనకు స్టూడెంట్ గా నటించారట. బలిపీఠం సినిమా షూటింగ్ సమయంలో పిలిచి మాట్లాడిచ్చేవారట శోభన్ బాబు. అలా పిలిచినపుడు బెరుకుగానే వెళ్లి ఆయనతో మాట్లాడేదట బేబీ రాణి. వెళ్లినపూడి నాగిరెడ్డి గారు అప్పటికే బేబీ రాణిగారికి రెమ్యూనరేషన్ బదులుగా ఒక ఇంటిని రాసిచ్చారట. ఆ ఇంటి గురించి రాణిగారిని అడిగారట శోభన్ బాబు.

ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అని రాణి గారి తల్లిని పిలిచి అడిగితే ఆమె పాప పేరు మీదే ఉంది గార్డియన్స్ గా మా పేర్లు ఉన్నాయి అని చెప్పారట. ఆ ఇంటిని అమ్మొద్దు పాపకోసం అలాగే పెట్టండి, తన కష్టంతో సంపాదించిన ఆస్తి తనకే ఉంచండి అని చెప్పారట. ఆ ఇల్లు బేబీ రాణి గారి పేరెంట్స్ అలాగే పెట్టి తాను పెద్దయ్యాక తనకే ఇచ్చేసారట. పెళ్లయ్యాక హైదరాబాద్ వచ్చేయాలని బేబీ రాణి అనుకున్నపుడు అదే ఇంటిని అమ్మి హైదరాబాద్ లో ఇల్లు కొని సెటిల్ అయ్యారట. పిల్లలు స్థిరపడ్డారని హైదరాబాద్ లో బాగా ఆస్తి కూడా చేశామని ఇంటర్వ్యూలో తెలిపారు. అపట్లో రెమ్యూనరేషన్ గా ఇచ్చిన ఆ స్థలం ఖరీదు ప్రస్తుతం కోట్లలో ఉంది అంటూ చెప్పారు బేబీ రాణి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago