Shruthi Hassan: వెండితెర నటిగా పలు సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శృతిహాసన్ ఒకరు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకున్నారు. క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ ఏడాది మొదట్లో బాలకృష్ణ చిరంజీవి హీరోలుగా నటించిన వీర సింహారెడ్డి,వాల్తేరు వీరయ్య సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా రెండు సినిమా విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వాల్తేరు వీరయ్య లో నటించిన ఓ పాట గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలోను మంచు కొండల్లో పాటలను చిత్రీకరించడం సర్వసాధారణం. వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఇలా మంచుకొండల్లో ఓ పాటను చిత్రీకరించారు. ఇలా మంచు కొండల్లో మంచు కురుస్తున్న సమయంలో పాటలను చిత్రీకరించడం చాలా కష్టం అంటూ ఈమె చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ ఇలాంటి పాటలలో నటించే సమయంలో హీరోలకు జాకెట్స్ వేస్తారు.
ఇక హీరోయిన్లకు కనీసం కోట్,సాలువ వంటివి కూడా ఇవ్వరని కేవలం చీర జాకెట్ తో మంచు కురుస్తున్న సమయంలో గడ్డకట్టే చలిలో కూడా డాన్స్ చేయాల్సి వస్తుందని తెలిపారు. దయచేసి హీరోయిన్ల పట్ల ఇలాంటివి ఆపండి,తాజాగా తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…