Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్, మరాఠీ నటి మృణాల్ ఠాకూర్. వీరిద్దరూ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ చిత్రం సీతారామం.ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ద్వారా వీరిద్దరికి తెలుగులో కూడా విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.
ఇక ఈ సినిమా తర్వాత నటి మృణాల్ నాని హీరోగా నటిస్తున్న తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే వీలు కుదిరినప్పుడు అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఓ నేటిజన్ ట్విట్టర్ వేదికగా ఈమెను ప్రశ్నిస్తూ సీతారామం సినిమాకు సీక్వెల్ సినిమా గురించి ప్రశ్నించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు హీరో చనిపోకుండా పాకిస్తాన్ లో బంధించి ఉన్నారనీఈ పాయింట్ మీద సీక్వెల్ చేస్తారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం గురించి నేటిజన్ ప్రశ్నిస్తూ సీతారామం 2 సాధ్యమేనా అని మృణాల్ ను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. తనకు ఈ సినిమా సీక్వెల్ గురించి ఐడియా లేదు కానీ ఉంటే బాగుంటుందని తాను కూడా అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు. మరి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఇందులో రష్మిక కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…