Actress Poorna: సినీ నటి పూర్ణ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఏప్రిల్ నాలుగవ తేదీ ఈమె మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ విధంగా పూర్ణ తలైందనే విషయం తెలియగానే ఎంతోమంది అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే తాజాగా పూర్ణ సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఈమె ఆపరేషన్ థియేటర్ నుంచి వీల్ చైర్ లో వస్తుండగా తనకోసం ఒక గదిని ఎంతో అద్భుతంగా అలంకరించి బేబీ బాయ్ అని రాసి ఉంచి తనకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇక ఈ వీడియోని పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాశారు.
బాబు పుట్టినప్పటినుంచి అమ్మతనంలో కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పూర్ణ ఈ వీడియోని షేర్ చేస్తూ… నా జీవితంలో ఈ అనుభూతి ఊహకు అందనిది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆమె నా ప్రపంచం. ఇప్పుడు నేను మరొకరికి తల్లిని అయ్యాను..ఇప్పుడు నేను పరిపూర్ణ స్త్రీగా మారాను అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ సైతం ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక పూర్ణ గత ఏడాది జూన్ నెలలో ఆసిఫ్ అలీ అనే దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత కొన్ని నెలలకే ఈమె ప్రెగ్నెంట్ అనే శుభవార్తను కూడా అభిమానులతో పంచుకొని తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఈమె పలు తెలుగు సినిమాలతో పాటు తెలుగు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…