Allu Arjun : మెగా కాంపౌండ్ హీరోలు అనగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత అంత పాపులర్ అయిన హీరోలు బన్నీ, చెర్రీ నే. ఇక ఇందులో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి బిజినెస్ మ్యాన్. గత కొన్నేళ్లుగా బన్నీ సినిమాల తీరు వేరుగా ఉంది, మెగా నీడ నుండి పక్కకు వచ్చి సొంత ఫ్యాన్ బేస్ ను చేసుకున్నాడు బన్నీ. మెగా అభిమానులకు బన్నీ ఇష్టముండొచ్చు కానీ మెగా ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా కొంతమంది బన్నీ ఫ్యాన్స్ ఉన్నవారు ఉన్నారు. ఇక బన్నీ మార్కెట్ ఏపీ తెలంగాణ మాత్రమే కాకుండా కేరళ, కర్ణాటక మరీ ముఖ్యంగా చాపకిందా నీరు లాగా నార్త్ లో పాకింది. పుష్ప సినిమా ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండానే నార్త్ లో ఇరగదీసింది. ఈ విజయంతో బన్నీకి నార్త్ లో ఉన్న క్రేజ్ అర్థమైంది.
కావాలనే చిరంజీవి పుట్టినరోజుకి డుమ్మా కొట్టాడా…
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ప్రతిసారి కంటే ఈసారి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఇండస్ట్రీ పెద్దగా, ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్న చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్బంగా గ్రాండ్ గా ప్లాన్ చేసారు మెగా కుటుంబం. ఇక వేడుకల్లో మెగా కుటుంబం పాల్గొనబోతోంది. అయితే బన్నీ ఈ వేడుకలకు వస్తాడా లేదా అన్న సందేహం ఉండేది. ఈ మధ్యనే బన్నీ ఫ్యాన్స్ చెర్రీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం ట్విట్టర్ వేదికగా బాగా జరిగింది. తీవ్రంగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ బాగా తిట్టుకున్నారు. ఇంత జరిగాక ఇపుడు బన్నీ ఈ వేడుకలకు హాజరైతే జరిగే పరిణామాలు ఏంటనే అనుమానం ఉంది. ఇక సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు వారి మధ్య విభేదలు ఉన్నాయో లేవో తెలియదు కానీ బయటికి అలాంటి ప్రచారం జరుగుతున్నపుడు బన్నీ ఈ వేడుకలకు వచ్చి ఉంటే క్లారిటీ వచ్చుండేది.
బన్నీ ఇండియా స్వాత్రంత్ర దినోత్సవం తాలుకు అమృత్ మహోత్సవ్ లో పాల్గొనడం కోసం న్యూ యార్క్ వెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ చిరు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాల్సి వస్తుందని వెళ్లుంటే మాత్రం అది తప్పు. చిరంజీవి లేకపోతే బన్నీ లేడు కదా, అది మర్చిపోయి ఉంటాడని అనుకోవడం లేదు అంటూ వివరించారు. ఇక ఏదైనా వీడియో సందేశం అలా విడుదల చేసినా ఫ్యాన్స్ మధ్య ఈ గొడవలు కొంచం తగ్గుతాయి అంటూ చెప్పారు ఇమంది రామారావు. ఒక కుటుంబం లో మనస్పర్తలు మంచివి కాదు అది కూడా సినిమా ఇండస్ట్రీ లో పెద్ద కుటుంబం మధ్య ఇలాంటివి మంచిది కాదు అంటూ వాఖ్యణించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…