Movie News

Allu Arjun: ఇంద్రభవనాన్ని మించిపోయేలా ఉన్న అల్లు అర్జున్ ఇల్లు.. ఇంటిని చూస్తే కళ్ళు జిగేలుమనాల్సిందే?

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజీ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయం అవసరం లేదు. స్టైలిష్ కి ఐకాన్ అయినటువంటి ఈయన ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ధరించే వస్తువుల నుంచి తిరిగే కార్లు ఉండే ఇల్లు కూడా ఎంతో విలాసవంతంగా ఎంతో ఖరీదైనది అని చెప్పాలి.

ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తాజాగా రెండు ఎకరాల స్థలంలో 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెట్టే ఆకారంలో నిర్మించిన ఇల్లు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇంటికి అల్లు అర్జున్ ఏకంగా 100 కోట్ల రూపాయల ఖర్చు చేసి తన ఇష్టానికి అనుగుణంగా డిజైన్ చేయించుకున్నారు.

జూబ్లీహిల్స్ లో నిర్మించిన ఈ ఇంటికి అల్లు అర్జున్ బ్లెస్సింగ్ అనే పేరు పెట్టారు. ఈ ఇంటిని అమీర్ & హమీదా అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు అమీర్ శర్మ దీనిని రూపొందించారు.ఫర్నిచర్ దగ్గర నుంచి మొదలుకొని అధునాతన సౌకర్యాలతో అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి ఎంతో సుందరంగా ఈ ఇంటిని తీర్చిదిద్దారు.

Allu Arjun: అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన బన్నీ..

ఈ ఇంటిలో కలర్స్ చూస్తే ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. చుట్టూ పచ్చదనం ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ఇంటిలో పార్టీలు చేసుకోవడానికి అనుగుణంగా అలాగే పిల్లలు ఆడుకోవడానికి, ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల సదుపాయాలను కూడా సమకూర్చారు. ఇలా అల్లు అర్జున్ తన రేంజ్ కు తగ్గట్టుగానే ఈ ఇంటిని అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అన్ని సౌకర్యాలతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

6 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

7 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

12 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

12 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

13 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

13 hours ago