RGV : సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ నిర్మాతల సమస్యల మీద సినిమా షూటింగుల బంద్. ఇక ఎవరికి తోచిన సొల్యూషన్ ఈ సమస్యకు వాళ్ళు చెబుతున్నారు. నిర్మాతల గిల్డ్ ముఖ్యంగా హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అంటూ డిమాండ్ చేయడం, హీరోలకోసం వచ్చే పర్సనల్ స్టాఫ్ ఖర్చులను తగ్గిస్తే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది అంటూ వివరిస్తున్నారు. ఇక ఈ విషయాలపై వివాదాలకు కేర్ ఆఫ్ అయిన ఆర్జీవి స్పందించారు. నిర్మాతల సమస్యల మీద మాట్లాడుతూ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక హీరో కి రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటే అది వాళ్ళ మార్కెట్ ను బట్టే ఇస్తారు ఒకవేళ ఆ హీరోకి అంత డిమాండ్ లేకపోతే ఎందుకు ఇస్తారు.
చిరంజీవి కి ప్రొడ్యూసర్లు ఊరికే డబ్బులు ఇస్తారా…
చిరంజీవి కి స్టార్ డమ్ రాగానే కొత్త కొత్త వాళ్లంతా ఆయనతో సినిమా తీయాలని వచ్చేవాళ్ళు పాత ప్రొడ్యూసర్ల కన్నా ఆయనకు ఎక్కువ ఆఫర్ చేసేవారు. ఆయనకు ఆ మార్కెట్ ఉంది కాబట్టే అంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. లేకపోతే ఎందుకు ఇస్తారు. ఇక పాత ప్రొడ్యూసర్లు స్టార్ గా ఎదగక ముందు కూడా చిరంజీవి తో సినిమాలు తీసుంటారు కాబట్టి ఎక్కువ డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. దీంతో చిరు అయినా కొత్త ప్రొడ్యూసర్లతో సినిమా తీస్తాడు. ఎందుకంటే ఆయన డిమాండ్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక ప్రొడక్షన్ కాస్ట్ కి మరో ఉదాహరణ గా అమితాబ్ బచ్చన్ గురించి చెప్పారు. అమితాబ్ బచ్చన్ కి 15 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు రెడీ అయిన ప్రొడ్యూసర్ ఆయన మేకప్ మ్యాన్ కి రోజుకి లక్ష ఇవ్వడానికి ఆలోచిస్తాడా. అక్కడ మేకప్ మ్యాన్ కాదు ముఖ్యమైన వ్యక్తి అమితాబ్ బచ్చన్. మేకప్ మ్యాన్ లు ఎంతో మంది మార్కెట్ లో ఉంటారు, కానీ అమితాబ్ బచ్చన్ కి నచ్చిన మేకప్ మ్యాన్ అవ్వడం వల్ల అతనికి రోజుకు లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇరవై రోజులు షూటింగ్ అంటే అతనికీ ఇరవై లక్షలు ఇవ్వాలి అలా మిగిలిన స్టాఫ్ అందరికి కలిపి మొత్తం ఒక కోటి రూపాయలు అనుకున్నా అమితాబ్ బచ్చన్ కి 15 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన వ్యక్తి ఇంకో కోటి రూపాయలు ఇవ్వలేడా అన్నదే పాయింట్. ఇక్కడ నిర్మాతలు రెండు రకాలుగా ఆలోచిస్తారు. కోటి రూపాయలు ఎక్కువ ఇస్తే సినిమా అటు ఇటు అయ్తే ఏంటి పరిస్థితి అని అలోచించి వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ పదహేను కోట్లతో పాటు ఇంకో కోటి పోయినా నాకేం ఫరక్ పడదు అనుకునే నిర్మాత ఇవ్వడానికి సిద్ధపడుతాడు.
రామోజీ రావు నాకు ఇచ్చిన ఆఫర్ నచ్చలేదు…
నేను శివ సినిమా చేసాక రామోజీరావు గారే పిలిచి ఉషాకిరణ్ మూవీస్ లో ఒక సినిమా చేయమని అడిగారు. సినిమా బడ్జెట్ 25 లక్షలు అని చెప్పారు. అయితే వేరే కొత్త నిర్మాత నా రెమ్యూనరేషనే ముప్పై లక్షలు ఇస్తానని చెప్పాడు. అప్పుడు నా దమాండ్ అది. రామోజీరావు గారు గొప్ప వ్యాపార వేత్త. ఆయన నా బడ్జెట్ అది దాటి సినిమా చేస్తే ఒకవేళ సినిమా ఆడకపోయినా పెద్దగా నష్టం రాదూ అనే లెక్కలో చెప్పాడు. నేను నా రెమ్యూనరేషన్ ముప్పై లక్షలు ఇవ్వడానికి కొత్త నిర్మాత ఇస్తానని చెప్పినపుడు ఆయన బయర్స్ మీద భార్మ పడుతుంది అది కరెక్ట్ కాదు అని చెప్పారు. కానీ ఒక తెలివి తక్కువ వాడు నాకు ముప్పై లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడినపుడు నేనుందుకు ఆ ఆఫర్ వదులుకుంటాను, రామోజీ రావు గారితో చేస్తే నాకేం ప్లస్ అవుతుంది అని బేరోజు వేసుకున్నా. అందుకే రామోజీరావు గారితో సినిమా చేయాలా వద్దా అని డిసైడ్ అయ్యాను. ఇక ప్రొడ్యూసర్స్ లెకపొతే సినిమా లేదు అనడం తప్పు, ప్రొడ్యూసర్ లేకపోతే కాదు చూసే ప్రేక్షకుడు లేకపోతే సినిమా ఉండదు. ఒక హోటల్ పెట్టేవాడు లేకపోతే ఏం కాదు, కానీ హోటల్ పెట్టాక తినేవాడు లేకపోతే నష్టం అంటూ వివరించాడు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…
హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…
ఇప్పటి పోటీ ప్రపంచంలో కెరీర్‌లో ఎదగడం అనేది చాలామందికి పెద్ద సవాలుగా మారింది. మంచి విద్య, కష్టపడే స్వభావం ఉన్నా…