Featured

Nikhil & Kavya Sree : నెక్స్ట్ లెవెల్ ప్రేమలో గోరింటాకు హీరో హీరోయిన్…!

Nikhil & Kavya Sree : సెలబ్రిటీ కపుల్ అనగానే అందరికి వారి ప్రేమ విషయాలు, ముచ్చట్లు తెలుసుకోవాలని ఉంటుంది. సినిమాల్లో అయినా, బుల్లితెర మీద అయినా కో స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. అలా బుల్లితెర మీద సీరియల్స్ లో కలిసి నటించిన వ్యక్తులు పరిచయం ప్రేమలా మార్చుకొని పెళ్లి తో ఒక్కటవుతుంటారు. అలాంటి సీరియల్ జంట నిఖిల్ మరియు కావ్యశ్రీలది. మా టీవిలో వచ్చిన గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర కు పరిచయమైన వీళ్ళిద్దరూ, ఆ సీరియల్ లో హీరో హీరోయిన్లుగా చేసారు. దాదాపు రెండేళ్లు పైనే వచ్చిన ఆ సీరియల్ తో పరిచయం స్నేహంగా మారి, ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరిదీ ఒకే ఊరు…

కర్ణాటకాకు చెందిన వీళ్లిద్దరూ గోరింటాకు సీరియల్ ఆఫర్ తో మైసూర్ నుండి బెంగళూరు వచ్చి అక్కడి నుండి హైదరాబాద్ వచ్చారు. కావ్య శ్రీ కి అంతగా తెలియక పోవడం వల్ల బెంగళూరు లో ఇద్దరూ కలిసి ఒకే బస్సు లో హైదరాబాద్ రావాలని సీరియల్ యూనిట్ చెప్పారట. మొదటి సారి బెంగళూరు బస్సు లో కావ్య ని చూసిన నిఖిల్ ఈమె ఎవరో సీరియల్ హీరోయిన్ అయ్యుండదు అనుకుని మాట్లాడలేదట. ఇక సీరియల్ షూటింగ్ మొదలయ్యాక తానే హీరోయిన్ అని అర్థమైంది. ఇక అప్పుడు మొదలైన పరిచయం ప్రేమగా మారిందని ఈ జంట చెప్పారు.

ఇక ఈ సీరియల్ తరువాత ఇద్దరూ కలిసి అమ్మ కు తెలియని కోయిలమ్మ సీరియల్ లో నటిస్తున్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఉండటం వల్లే మా ప్రేమ బలపడిందంటూ వివరించారు. ఇక నిఖిల్ బాగా వంటలు చేస్తాడంటూ కావ్య చెప్పారు. కావ్య జోక్ ని జోక్ లా తీసుకుంటుంది ఏ విషయం సీరియస్ గా తీసుకోవాలో తనకు బాగా తెలుసు ఈ గుణం నాకు బాగా నచ్చుతుంది అంటూ నిఖిల్ కావ్య గురించి చెప్పాడు. తనకు సర్ ప్రైజ్ చేయడం అస్సలు రాదని ఎక్కువ సేపు విషయాన్ని దాచలేదని చెప్పాడు. ఇలా సరదా ముచ్చట్లతో ఒకరి పై ఒకరికి ఎంత ప్రేమ ఉందో వీళ్ళ మాటల్లోనే ఇద్దరూ చూపించుకున్నారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago