Allu Arjun: ప్రస్తుతం సినీ ప్రపంచం మొత్తం పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం సామాన్య సినీ వర్గం వారే కాకుండా అన్ని రంగాల వారు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయలేకపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దీనికి తోడు మొన్న పాట్నాలో జరిగిన ఈవెంట్ సాధించిన బిగ్ సక్సెస్ తో ఇప్పుడు ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ అయింది. ఈ వైల్డ్ ఫైర్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఎంతోమంది తమ విషెస్ నిసోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అందులో ఒకరు అల్లు అర్జున్ ఫ్రెండ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇతను అల్లు అర్జున్ కి బెస్ట్ విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని అగర్బత్తీలు, అగ్గిపెట్టెలు, బిస్కెట్స్ కంపెనీలు వాటి ప్రొడక్ట్స్ పై పుష్ప ఫోటోలు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అలాంటి వాటిని ఫోటోలు తీసి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తన ట్విట్టర్లో షేర్ చేస్తూ పుష్ప టు మూవీకి ఆల్ ది బెస్ట్, స్క్రీన్ పై వైల్డ్ ఫైర్ చూడటానికి ఎదురు చూస్తున్నాను అంటూ పోస్టు చేశాడు. అయితే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనుకుంటున్నారా అల్లు కాంపౌండ్ కి మెగా కాంపౌండ్ కి మధ్య దూరం పెరగడానికి కారణం అయిన వ్యక్తే ఈ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇతడు నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అల్లు అర్జున్ ఇతడిని సపోర్ట్ చేశాడు.
అప్పట్లో ఇదే విషయంపై పెద్ద రచ్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీని కారణంగానే మెగా కాంపౌండ్ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని కాకుండా జగన్ ని సపోర్ట్ చేసినందుకు పవన్ వర్గం వారందరూ అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. అయితే అనుకోని విధంగా ఆ ఎన్నికలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తన ఫ్రెండ్ కోసం చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…