Allu Arjun: అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య కొత్త కొంతకాలంగా విభేదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలియజేయకుండా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారో ఆ క్షణం నుంచి వీరి మధ్య పెద్ద ఎత్తున అంతర్గత యుద్ధం నడుస్తుందని చెప్పాలి. పైకి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పినప్పటికీ అంతర్గతంగా మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది అనేది మాత్రం వాస్తవం.
ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ మరోసారి పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. మరి అల్లు అర్జున్ ఈ పోస్ట్ తెలిసి చేశారా లేక తెలియక చేసారో తెలియదు కానీ ఇది కాస్త సోషల్ మీడియాలో మరోసారి ఇద్దరి అభిమానుల మధ్య యుద్ధానికి నాంది పలికింది.
అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన స్పెషల్ సాంగ్ కి సంబంధించి పోస్ట్ విడుదల చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నటి శ్రీల పక్కన కూర్చుని ఉన్నటువంటి పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ వెనక ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గురించి ఒక కాంట్రవర్సీస్ ప్ల కార్డు పట్టుకున్నారు.
ఇందులో ఏం పీకలేరు బ్రదర్ PK అంటూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ట్యాగ్ ఉంది. తొలుత అది పోస్ట్ చేసిన బన్నీ ఆ తర్వాత ఏమనుకున్నాడో దానిని డిలీట్ చేసేసాడు. తిరిగి ఆ ఫోటోని క్రాప్ చేసి ఈయన షేర్ చేశారు. ఇక ఈయన పొరపాటున చేశారా లేక తెలిసే చేశారా అనేది తెలియదు కానీ ఈయన పోస్ట్ చేస్తే డిలీట్ చేయడంతో మరోసారి ఇద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ స్టార్ట్ అయిందని చెప్పాలి.
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…