Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నటువంటి అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అల్లుఅర్జున్ సినీ కెరియర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతోంది.ఇక ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు.
అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మనకు తెలిసిందే. వీరి గురించి అల్లు స్నేహ రెడ్డి నిత్యం సోషల్ మీడియా వేదికగా వారిలో ఉన్న నైపుణ్యాలను బయట పెడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఇంత చిన్న వయస్సులో వీరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇకపోతే అల్లు వారసురాలిగా అల్లు అర్హ ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సమంత పాన్ ఇండియా స్థాయిలో నటించిన శాకుంతలం అనే సినిమాలో భరతుడి పాత్రలో నటించారు. అదేవిధంగా ఈమె ఎన్నో విషయాలలో అద్భుతమైన మెలకువలు కలిగి ఉన్నారని నిరూపించుకుంది.ఇలా ఇంత చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ ఉన్నటువంటి అర్హ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్హను నీ పేరేంటి అని ప్రశ్నించగా వెంటనే.. అల్లు అర్హ రెడ్డి అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈమె పేరు విన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈమె తన తండ్రి సామాజిక వర్గానికి సంబంధించిన పేరు కాకుండా తన తల్లి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పేరు అల్లు అర్హ రెడ్డి అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ క్రమంలోనే కొందరు ఈ విషయం పై స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి తరం పిల్లలు రేపటి భవిష్యత్తు. అలాంటి పిల్లలకు మంచి విషయాలను నేర్పించాలి కానీ ఇలా ఇంత చిన్న వయసులోనే పిల్లలను కులం అనే రొంపిలోకి నెడుతూ వారికి సమాజ శ్రేయస్సు అనేది లేకుండా చేస్తున్నారు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలాగే మరికొందరు పిల్లలకు ఏం నేర్పుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…