Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఆస్కార్ అవార్డు టార్గెట్ గా ఈ సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఇక పుష్ప సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న సందర్భంగా ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు .ఈ టీజర్ వీడియోలో అల్లు అర్జున్ ఏకంగా అమ్మవారి గెటప్ లో చీర కట్టుకొని ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నారని వీడియో చూస్తేనే అర్థమవుతుంది.
నటన పరంగా ఎలాంటి కష్టమైనా అనుభవిస్తూ 100% ఆ పాత్రలకు న్యాయం చేసే అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో మాత్రం చీర కట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది. సాధారణంగా చీర కట్టుకొని నడవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ అల్లు అర్జున్ ఏకంగా యాక్షన్ సన్ని వేశాలలో నటించారు.
చీరలో ఫైట్..
ముఖ్యంగా ఈయనకు చీర కట్టుకొని ఫైట్ చేయడం ఎంతో కష్టతరంగా మారిందట కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ కి 100% న్యాయం చేసేలా ఈయన ఎంతో కష్టపడుతూ కేవలం ఈ సీక్వెన్స్ పూర్తి చేయడానికి సుమారు 51 టేకులు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రతి సన్నివేశం కూడా స్పష్టంగా రావడం కోసం ఈయన ఇంతగా కష్టపడ్డారట మరోవైపు చీరలో అలవాటు లేకపోవడంతో ఇన్ని టేక్స్ తీసుకున్నారని తెలుస్తోంది అయితే చివరికి ఈ సీన్ చాలా హైలైట్ గా మారబోతుందని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…