Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదలకు కొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమాకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ విషెస్ చెబుతున్నారు.
ఈ క్రమంలోనే మెగా హీరో కూడా ఈ సినిమాకు విష్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . అల్లు అర్జున్ ఎప్పుడైతే వైకాపా నాయకుడుకు మద్దతు తెలిపారు అప్పటినుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ దూరం పెడుతూ వస్తుంది ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా పుష్ప సినిమా గురించి స్పందించలేదు.
ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయకపోవడంతో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ఏకంగా అల్లు అర్జున్ అలాగే ఆయన భార్య స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. అయితే నేడు పుష్ప సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పుష్ప సినిమాకు అలాగే అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ అలాగే సుకుమార్ అండ్ టీంకు నా హృదయపూర్వక బ్లాక్ బాస్టర్ శుభాకాంక్షలు అంటూ ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పై నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ పోస్ట్ పట్ల అల్లు అర్జున్ స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…