Allu Arjun: పుష్ప 2 సినిమా విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు పలు ప్రాంతాలలో పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తుంది .ఈ సినిమాని విడుదల కాకుండా అడ్డుకుంటామని ఒకవేళ విడుదలైన మా నియోజకవర్గంలో ఈ సినిమాను నిలిపివేస్తాము అంటూ పలువురు జనసేన ఎమ్మెల్యేలు అలాగే బిజెపి ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా గన్నవరం జనసేన నేత చలమ శెట్టి రమేష్ బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాని మా నియోజక వర్గంలో విడుదల కాకుండా అడ్డుకుంటాము అంటూ ఈయన వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ అహం నెత్తిన పెట్టుకొని, ఆయన పోకడలతో జనసైనికులను మెగా అభిమానులను చాలా బాధ పెట్టింది.
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వైకాపా పార్టీకి మద్దతు తెలియజేశారు. అహంకారం నెత్తిన పెట్టుకొని జనసేనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకో లేదంటే పుష్ప 2 సినిమాని అడ్డుకుంటాం అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
ఇలా సినిమాల పరంగా కాకుండా అల్లు అర్జున్ పొలిటికల్ పరంగా టార్గెట్ చేస్తూ కూటమి నేతలు తన సినిమాని అడ్డుకుంటాము అంటూ వార్నింగ్ ఇస్తున్నారు అయితే ఈ వార్నింగులు పై స్వయంగా మెగా అభిమానులు కూడా స్పందిస్తున్నారు. తాను మెగా అభిమానినే కానీ ఈ సినిమా టికెట్లు బుక్ చేసాము అంటూ కొందరు కామెంట్లు చేయగా సినిమా మంచిగా ఉంటే ఎవరు విజయాన్ని అడ్డుకోలేరు అంటూ మరికొందరు బన్నీకి సపోర్ట్ చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…