Allu Shirish: సినీ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ కుటుంబం నుంచి అల్లు అరవింద్ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ కాగా అరవింద్ కుమారులు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అల్లు శిరీష్ సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతున్నారు.
ఇలా శిరీష్ ఇప్పటివరకు తెలుగులో పలు సినిమాలలో నటించారు. అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. త్వరలోనే ఈయన మరో సరికొత్త చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అల్లు శిరీష్ నటించిన బడ్డీ అనే చిత్రం జులై 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా ప్రతి ఒక్క హీరోకి కూడా పీఆర్ టీం ఉంటుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి కూడా గత పది సంవత్సరాలుగా ఈ టీం ఉందని అయితే ఈ టీం చాలా పెద్దదని తెలిపారు.
పీ ఆర్ టీమ్…
అన్నయ్యకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా వెంటనే నెగిటివిటీ వ్యాపించకుండా ఈ టీం అడ్డుకుంటుందని, ఇక తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి చాలా యాక్టివ్ గా రియాక్ట్ అవుతూ తనకు ఒక ధైర్యంలా ఉంటారని తెలిపారు. ఈ పిఆర్ టీమ్ అన్నయ్య ధైర్యం అంటూ శిరీష్ తెలిపారు. ఇక గత కొద్దిరోజులుగా మెగా అల్లు కుటుంబాల మధ్య ఉన్న విభేదాల గురించి వస్తున్న వార్తల గురించి కూడా తన పీ ఆర్ టీమ్ చూసుకుంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…