Categories: FeaturedMovie News

అల్లు అర్జున్ కూడా కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో నటించారు.. ఆ సినిమా ఏంటో మీకు తెలుసా.?!

అప్పటి వరకు కుటుంబ పరమైన చిత్రాలను మాత్రమే తీసే కె.విశ్వనాధ్ సిరిసిరిమువ్వ తో ఒక్కసారిగా కళాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపడం జరిగింది. ఆ క్రమంలో సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణకమలం, శృతిలయలు, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి చిత్రాలను తీసి తెలుగు పరిశ్రమలోనే కాదు జాతీయస్థాయిలో అనేక అవార్డులతో పాటు మంచి గుర్తింపును పొందారు.

ఆయన తీసిన అనేక చిత్రాలలో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమా కె.విశ్వనాథ్ కి మంచి పేరును తీసుకు వచ్చింది. విధవ పాత్రలో రాధిక స్తబ్దుగా, నిశ్శబ్దంగా అద్భుతమైన నటనను కనబరచగా.. అమాయక పాత్ర లో కమల్ హాసన్ నటించాడు అనేకంటే జీవించాడని చెప్పవచ్చు. నిర్మలమ్మ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్ళింది.

సౌత్ ఇండియా టాప్ స్టార్స్ లలో బన్నీ కూడా ఒకరు. అద్భుతమైన స్టెప్పులతో అల్లు అర్జున్ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. 1986 మార్చి లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నటించారు. ఒక సీన్ లో కమల్ హాసన్ వయస్సు మళ్ళిన ఒక పాత్రలో కనిపిస్తారు. అయితే కమల్ హాసన్ మనవల్లగ కొంత మంది బాల నటులు కనిపిస్తారు. అలా అల్లు అర్జున్ తన కజిన్స్ తో పాటుగా ఈ సినిమాలో నటించారు. కళాతపస్వి విశ్వనాధ్ డైరెక్షన్ లో హీరోగా చేయక పోయినప్పటికీ కనీసం బాలనటుడిగా నటించానని అల్లు అర్జున్ హర్షాన్ని వ్యక్తం చేశారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago