Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అమర్ దీప్ ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పుడు తన ఫ్యామిలీని కూడా భారీ స్థాయిలో బూతు కామెంట్లతో ట్రోల్ చేశారు. ఇక ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన కారు పై దాడి జరగడమే కాకుండా ఎంతోమంది ఈయన పట్ల భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఇన్ని రోజులపాటు ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నటువంటి అమర్ ప్రస్తుతం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆరోజు ఏం జరిగింది అనే విషయాలన్నీ వెల్లడించారు. బిగ్ బాస్ పూర్తి చేసుకొని బయటకు వస్తుంటే మా వాళ్ళందరూ రావద్దు దాకో అంటూ నాకు చెప్పారు అసలు నేను ఎందుకు దాక్కోవాలి ఏం తప్పు చేశానని కారు ఎక్కాను కారు బయటకు రాగానే ఎంతోమంది సెల్ఫోన్ లైట్లు వేసుకొని కారుని చుట్టుముట్టారని ఆ సమయంలోనే రాళ్లతో విసరడం మా అమ్మ ముందే అమ్మ గురించి బూతులు మాట్లాడారని అమర్ తెలిపారు.
మనపై ఎవరైనా రెండు దెబ్బలు కొట్టిన భరించవచ్చు గాని కన్న కొడుకు ముందు తల్లిని అలా మాట్లాడుతుంటే చూడలేకపోయాను నేను కారు దిగడానికి ప్రయత్నం చేయగా అమ్మ ఆపిందని తెలిపారు. ఇక అమ్మను మాత్రమే కాకుండా తేజుని కూడా చాలా తిట్టారు నీ భార్యను తీసుకెళ్తామంటూ మాట్లాడారు చాలా బాధేసిందని అయితే ఇప్పుడు నేను కేసులు పెట్టొచ్చు కానీ వారికంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఉద్దేశంతోనే నేను ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టలేదని అమర్ తెలిపారు.
అమ్మను తిడితే బాధ కలిగింది.
అదొక గేమ్ షో మాత్రమే దానిని గేమ్ లాగా చూస్తే ఈ గొడవలు ఉండవని అమర్ తెలిపారు. నేను జెన్యూన్ గానే గేమ్ ఆడను అందరిలాగ ముందు ఒకలా వెనక ఒకలాగా మాట్లాడలేదని అయినప్పటికీ నన్ను నా ఫ్యామిలీని ఎంతో ఇబ్బంది పెట్టారు అంటూ అమర్ మొదటిసారి తనపై జరిగినటువంటి దాడి గురించి స్పందించి చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…