Political News

‘మీ కుటుంబం గురించి మాకు తెలియదా?’ హోమ్ మంత్రి అనితపై ఫైర్ అయిన అంబటి రాంబాబు!

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 164 సీట్లు గెలిచి మంచి పాలన అందించాల్సిన టీడీపీ, దాని బదులు జగన్ నామ జపం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల అమలును మరిచి, జగన్‌ను కట్టడి చేయడానికే పాలన పరిమితమైపోయిందని అంబటి వ్యాఖ్యానించారు.

Ambati Rambabu fires at Home Minister Anitha!

జగన్‌ను ఆపటం మీ తరం కాదు

“చిట్టినాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయింది. జగన్‌ను ఆపటం మీ తరం కాదు. ఆయన వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం చేస్తున్నారు,” అని అంబటి రాంబాబు వ్యంగ్యంగా అన్నారు. శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన హోం మంత్రి, ఆ పని మానేసి జగన్‌పై విమర్శలు చేయడానికే పరిమితమైపోయాడని ఆయన విమర్శించారు.

కుటుంబ అంశాలపై ఎదురుదాడి

“తల్లి, చెల్లి వాటాల గురించి మీరు చెబుతున్నారు. మీ కుటుంబం గురించి మాకు తెలియదా? చెక్స్ కేసుల్లో మీరు కోర్టుల దారి పట్టలేదా?” అని అంబటి ప్రశ్నించారు. రాజధాని, పోలవరం నిర్మాణం గురించి మర్చిపోయి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని రాంబాబు మండిపడ్డారు.

ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసుల ఆరోపణ

అంబటి రాంబాబు మరో కీలక వ్యాఖ్య చేస్తూ, “మీరు మీ మంత్రివర్గ సభ్యులను జైల్లో పెడుతున్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా వాళ్లపై ఇదే చేయమంటారా?” అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. “మీరు ఎవరూ అతీతులు కాదు,” అని హెచ్చరించారు.

అధికారానికి హద్దులు తెలుసుకోవాలి

రాజకీయంగా వైసీపీని అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని, నిబంధనల ప్రకారం మాత్రమే వ్యవహరించాలని టీడీపీ ప్రభుత్వానికి సూచించారు. చివరిగా, “లోకేష్ ఇప్పుడు హై క్యాష్‌తో ఉన్నాడు. కానీ అధికారం మూన్నాళ్ల ముచ్చట మాత్రమే అని తెలుసుకోవాలి” అని అంబటి వ్యంగ్యంగా అన్నారు.

telugudesk

Recent Posts

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

6 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

34 minutes ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

36 minutes ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

56 minutes ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

59 minutes ago

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. వైద్య రంగంలో సంచలనం!

ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…

1 hour ago