Ambati Rambabu fires at Home Minister Anitha!
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 164 సీట్లు గెలిచి మంచి పాలన అందించాల్సిన టీడీపీ, దాని బదులు జగన్ నామ జపం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల అమలును మరిచి, జగన్‌ను కట్టడి చేయడానికే పాలన పరిమితమైపోయిందని అంబటి వ్యాఖ్యానించారు.
“చిట్టినాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయింది. జగన్‌ను ఆపటం మీ తరం కాదు. ఆయన వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం చేస్తున్నారు,” అని అంబటి రాంబాబు వ్యంగ్యంగా అన్నారు. శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన హోం మంత్రి, ఆ పని మానేసి జగన్‌పై విమర్శలు చేయడానికే పరిమితమైపోయాడని ఆయన విమర్శించారు.
“తల్లి, చెల్లి వాటాల గురించి మీరు చెబుతున్నారు. మీ కుటుంబం గురించి మాకు తెలియదా? చెక్స్ కేసుల్లో మీరు కోర్టుల దారి పట్టలేదా?” అని అంబటి ప్రశ్నించారు. రాజధాని, పోలవరం నిర్మాణం గురించి మర్చిపోయి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని రాంబాబు మండిపడ్డారు.
అంబటి రాంబాబు మరో కీలక వ్యాఖ్య చేస్తూ, “మీరు మీ మంత్రివర్గ సభ్యులను జైల్లో పెడుతున్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా వాళ్లపై ఇదే చేయమంటారా?” అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. “మీరు ఎవరూ అతీతులు కాదు,” అని హెచ్చరించారు.
రాజకీయంగా వైసీపీని అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని, నిబంధనల ప్రకారం మాత్రమే వ్యవహరించాలని టీడీపీ ప్రభుత్వానికి సూచించారు. చివరిగా, “లోకేష్ ఇప్పుడు హై క్యాష్‌తో ఉన్నాడు. కానీ అధికారం మూన్నాళ్ల ముచ్చట మాత్రమే అని తెలుసుకోవాలి” అని అంబటి వ్యంగ్యంగా అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…