Ambati Rambabu in old films : అంబటి రాంబాబు రాజకీయాలు ఫాలో అయ్యే వారికి బాగా సుపరిచితులు. ఆయన వైసీపీ మౌత్ పీస్ మైక్ పట్టుకున్నారంటే మాట్లాడుతూనే ఉంటారు అనర్గళంగా. ఇక ఆయన మొదట రాజకీయ నాయకుడు. బతకడానికి ఏమైనా వ్యాపారాలు చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మంత్రి అయ్యారు. అంత వరకూ ఎక్కువ మందికి తెలుసు. అంతకుముందు ఆయన ఏమి చేసే వారో చాలా మందికి తెలియదు.
సినిమాల్లో, సీరియల్స్ లో నటనా అనుభవం :
చాలా మందికి అంబటి గురించి తెలియని విషయం ఏంటంటే అంబటి సినిమాల్లో నటించారు. కొన్ని సీరియల్స్ లో నటించిన అనుభవం కూడా ఉందట.ఆయన ప్రెస్‌మీట్‌లు చూస్తే ఆ మాటలు ఆ అభినయం అన్నీ పరిశీలిస్తే అన్ని వేరియేషన్స్ చూపించడం నటుల వల్లే సాధ్యమవుతుందే అనుకోని వారు ఉండరు. ఆయన కు సినీ పరిశ్రమలో సన్నిహితులు ఉన్నారని చాలా మందికి తెలుసు.
సినీ పరిశ్రమలో జీవితా రాజశేఖర్ బాగా పరిచయస్తులు అంబటికి.జీవితా రాజశేఖర్ లు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన, వైసీపీ లో చేరిన అది అంబటి చలవే. ఈ విషయాన్నీ వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పారు.ఇక అంబటి నటుడు అన్న విషయానికి వస్తే ప్రముఖమైన సినిమాలు లేదా సీరియల్స్ లో కనిపించకపోవడం, ఆయన ఎపుడు ఈ విషయాన్నీ ప్రస్తావించకపోవడం వల్ల ఎవరికీ తెలియదు.కానీ ఆయన నటించిన కొన్ని సన్నివేశాల తాలూకా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవి ఇప్పటివి కావు. వయసులో ఉన్నప్పటివి. కాస్త పట్టి పట్టి చూస్తేనే కానీ అవి అంబటి రాంబాబు ఫోటోలు అని అర్థం చేసుకోలేం. ఎందుకంటే మేకప్‌లో ఉన్నారు కదా . ఇక ఈ విషయంపైన ఆయనే ఒక ప్రెస్ మీట్లో క్లారిటీ ఇస్తే ఆయన శైలిలో సరిపోతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…