Ycp comparing Roja and pavan kalyan : నిన్న మంత్రి పదవి దక్కడంతో నగరి ఎమ్మెల్యే, సినిమా హీరోయిన్ ఆర్ కే రోజా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను జడ్జిగా పదేళ్లుగా వ్యవహరిస్తున్న జబర్దస్త్ మరియు సినిమాలకు వీడ్కోలు పలికారు.మంత్రిగా తన బాధ్యతలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక జబర్దస్త్లోనూ ఆమెకు వీడ్కోలు పలికి కన్నీరు పెట్టుకున్నారు జబర్దస్త్ కంటెస్టెంట్స్.
మా రోజా మానేసింది…చూసి మీ పవన్ ను నేర్చుకోమనండి….
ఇక రోజా నిర్ణయం తన వ్యక్తిగతం ఇక మంత్రిగా భాద్యతలు ఉంటాయి కాబట్టి ఇటు గ్లామర్ రంగానికి అటు రాజకీయాలకు న్యాయం చేయలేనని ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అయితే కొంత మంది వైసీపి అభిమానులు సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతకు రోజా ను చూపి నేర్చుకోమంటూ సలహా ఇస్తున్నారు. అసలు పొంతనలేని ఈ సలహాకు అందరూ ఆశ్చర్యం తో పాటు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రోజా ప్రజాప్రతినిధిగా ఉంటూనే జబర్దస్త్ లోను ఇంకా సినిమాల్లోను పనిచేసారు.ఎమ్మెల్యే కాగానే సినిమా రంగానికి గుడ్ బై చెప్పలేదు. ఇపుడు కూడా తన బాధ్యత వల్ల తాను ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో మళ్ళీ సినిమా రంగంలోకి మళ్ళీ రావచ్చు చెప్పలేము. అయితే ఆమె నిర్ణయాన్ని తప్పుపట్టకూడదు అలాగే ఆమె నిర్ణయం హర్షణీయం కానీ అదే పని పవన్ ను చేయమనడం హాస్యాస్పదంగా ఉంది. పవన్ ప్రజా ప్రతినిధి కాదు రాజకీయాల్లో ఉన్నారు కానీ పదవుల్లో లేరు అలాంటపుడు సినిమాను వదులుకోవాల్సిన పని లేదు. అదీకాక పదవుల్లో ఉంటూనే సినిమాల్లో నాటించిన వారు ఎందరో అలా చేయకూడదని రాజ్యాంగం లో ఏమి లేదు కదా. మరీ ఈ అర్థం లేని వాదన ఎందుకు. పదవుల్లో ఉంటూ వారి వ్యాపారాలు చూసుకుంటున్న వారు ఎంతమంది లేరు. సినిమాలు మానేయాలా వద్దా అన్నది పవన్ సొంత విషయం ఇక ఈ విషయం పై జనసేన కార్యకర్తలు కూడా గట్టిగా బదులు చెప్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…