Featured

Manchu Lakshmi : తమ్ముళ్లు లేని జీవితం ఊహించుకోలేను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మ…పోస్ట్ వైరల్ ….!

Manchu Lakshmi intresting comments about brothers : తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు మంచి హీరోగా వెలుగొందిన విషయం తెలిసిందే. ఆయన వారసులుగా మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్ ముగ్గురు కూడా సినీ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసుకున్నారు. మంచు మనోజ్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. మంచి నటుడిగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక విష్ణు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి విష్ణు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

మంచు లక్ష్మి ఒకవైపు సినిమాలో రాణిస్తూనే మరోవైపు బుల్లితెర మీద కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ అదరగొడుతుంది. ఇక ఈ మంచు ఫ్యామిలీ వివాదాలకు కూడా కేరాఫ్ గానే ఉంటుంది. మంచు లక్ష్మి విషయానికి వస్తే బుల్లితెర మీద వెండితెర మీదే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా మంచు లక్ష్మి తన సోదరులైన విష్ణు మనోజ్ లకు సంబంధించి పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది.

తమ్ముళ్ల గురించి ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి….

తాజాగా మంచు లక్ష్మి చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మంచు లక్ష్మి తాజాగా తన సోదరులైన మంచు విష్ణు మనోజ్ లతో తీసుకున్న ఒక ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా ఈ ఫోటో తో పాటు..“ఎల్లప్పుడూ నా వెన్నంటే అండగా ఉంటున్నందుకు థ్యాంక్స్. మీరిద్దరూ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను” అంటూ హ్యాపీ క్యాప్షన్ జోడించింది. మంచు లక్ష్మి పోస్ట్ చేసిన ఈ ఫోటోలో ముగ్గురు వైట్ డ్రెస్ లోనే కనిపించడం మరో విశేషం. ఈ పోస్ట్ చూసిన అభిమానులు అంతా ఏంటి స్పెషల్ అంటూ కామెంట్లు జత చేస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago