Featured

Singer parvathi : అవమానమా…?రేటింగ్స్ కోసం ఛానెల్ ప్రయత్నమా…? ‘సరిగమప’ ప్రోగ్రామ్ ప్రోమో పై అనుమానాలు…!

Singer Parvathi : సంగీత కార్యక్రమాలకు కొదవ లేదు తెలుగు బుల్లి తెరపై . ఈటీవీ లో ఏళ్ల తరబడి వస్తోన్న పాడుతా తీయగా కార్యక్రమం ఇప్పటికి కొనసాగుతోంది. కరోనా కాలంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇన్ఫెక్షన్లతో మరణించాక ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఇప్పుడు పాడుతా తీయగాను నడిపిస్తున్నారు. ఇక ఈ టీవీలో వచ్చే ఈ షో ఎంతో మంది గాయనీ గాయకులను తెలుగు తెరకు పరిచయం చేసింది. ఇక దీనిలాగే జీ తెలుగులో కూడా సరిగమప అంటూ పాటల ప్రోగ్రాం వస్తుంది. సంగీత దర్శకుడు కోటి సారథ్యంలో వస్తున్న ఈ పాటల కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయనీ గాయకులు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇక ఈ కార్యక్రమం ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. సరిగమప కొత్త సీజన్ మొదలయ్యాక తొలిగా గుర్తింపు పొందిన సింగర్ పార్వతి. మొదటి రోజే పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది తన గాత్రంతో పార్వతి.

పార్వతి గ్రామానికి బస్సు….పార్వతి పాట చలవే…..

పార్వతి ఎంతో కష్టపడి సంగీతాన్ని నేర్చుకున్నారు. సంగీతంపై ఆసక్తితో తన గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోయినా నడుచుకుంటూ వేరే గ్రామానికి వెళ్లి సంగీత సాధన చేసింది పార్వతి. ఇక తన గాత్రం తో మంచి పేరు తెచ్చుకున్న పార్వతి తన కోకిల గొంతు తో అందరినీ ఆకట్టుకుంది.మొదటి రోజే అద్భుతమైన పాట పాడి బస్సులేని తన గ్రామానికి బస్సు రప్పించిన ఘనత పార్వతికి దక్కిందని చెప్పాలి.

అవమానాలు ఎదురవుతాయా…లేక ప్రోగ్రాం టీఆర్పి పెంచడం కోసమా…..
ఇలా కొద్ది కాలం లోనే తన ప్రతిభతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పార్వతి ఇకపై అవమానాలను ఎదుర్కొనబోతోందా అనే సందేహాలు వస్తున్నాయి చూసే ప్రేక్షకులకు. ఇక ఈ వారం ప్రోమోలో పార్వతి కి చేదు అనుభవం ఎదురైనట్టు చూపించడాన్ని అలాగే భావించలేమో. ఈ ప్రోమోలో భాగంగా సింగర్ పార్వతికి చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ ప్రోమోలో పార్వతి పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలోని మగువా మగువా అనే పాట పాడింది. ఇక ఈ పాట పాడే సమయంలో ఈమె మొదటిలోనే లిరిక్ మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇలా వేదికపై పార్వతి పాట పాడుతూ తడబడటంతో వెంటనే జడ్జి స్థానంలో ఉన్న కోటి కట్ చెప్పారు. ఈ విధంగా పార్వతి పాట పాడుతూ తడబడటంతో ఒక్కసారిగా సరిగమప వేదిక మొత్తం షాక్ కి గురైంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఇక పార్వతి అవమానాలు ఎదుర్కొనబోతోందని కొందరు భావిస్తుంటే మరికొందరు జీ తెలుగు ప్రోగ్రాం టీఆర్పి పెంచడం కోసం. వేసిన ఎత్తుగడగా చెప్తున్నారు. ఇంతకీ అసలు ఏమి జరిగిందో తెలియాలంటే మాత్రం ప్రోగ్రామ్ చూడాల్సిందే.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago