Hero Yash: తెలుగు మీడియాకు క్షమాపణలు చెప్పిన కన్నడ స్టార్ యశ్… రివేంజ్ మామూలుగా లేదు!
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజిఎఫ్ 2 సినిమా ఈ నెల 14వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ హీరో మీడియాకు క్షమాపణలు చెప్పారు. అయితే యశ్ మీడియాకు క్షమాపణలు ఎందుకు చెప్పారనే విషయానికి వస్తే…
ఈ మీడియా సమావేశంలో భాగంగా హీరో యశ్ రావలసిన సమయం కన్నా గంటన్నర ఆలస్యంగా రావడంతో ఒక జర్నలిస్టు మీకోసం గంటన్నర నుంచి ఎదురుచూస్తున్నాము అంటూ ఆయనని ప్రశ్నించగా వెంటనే యశ్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే గతంలో అల్లు అర్జున్ విషయంలో కూడా కన్నడ మీడియా ఇలాగే వ్యవహరించింది. పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ మీట్ 11:30 అయితే అల్లు అర్జున్ 1:30కి వెళ్లడంతో కన్నడ జర్నలిస్ట్ ఈ విషయం గురించి అల్లుఅర్జున్ ప్రశ్నించారు. అయితే ఆలస్యంగా వచ్చినందుకు అల్లుఅర్జున్ గతంలో కన్నడ మీడియాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
ప్రస్తుతం కన్నడ హీరో యశ్ కూడా క్షమాపణలు చెప్పడంతో తెలుగు మీడియా, కన్నడ మీడియాపై ఈ విధంగా రివేంజ్ తీర్చుకున్నారని చెప్పాలి. సాధారణంగా హీరోలు ఇలాంటి మీటింగులకు హాజరయ్యే సమయంలో పలు కారణాల వల్ల కొన్నిసార్లు ఇలాంటి ఆలస్యం జరగడం సర్వసాధారణం. ‘కె.జి.ఎఫ్2’ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…