Kiraak RP: వామ్మో జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ ఇంటికి చూశారా… ఇంద్ర భవనాని తలపిస్తున్న ఆర్పీ ఇల్లు!
Kiraak RP: బుల్లితెరపై ప్రసారమౌతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపు సంపాదించుకొని వారి కెరియర్లో దూసుకుపోతున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఆర్పీ తనదైన శైలిలో ప్రత్యేకమైన యాస ద్వారా అద్భుతమైన కామెడీ స్కిట్లు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ప్రతి ఒక సెలబ్రిటీ సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి హోమ్ టూర్ చేయడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే కిరాక్ఆర్పీ కూడా తన హోమ్ టూర్ చేసి తన ఇంటిని చూపించారు. ప్రస్తుతం ఆర్పీ హోమ్ టూర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కిరాక్ ఆర్పీ హోమ్ టూర్ వీడియో చూస్తే మాత్రం కళ్ళు తిరగడం ఖాయం. అచ్చం ఇంద్ర భవనాన్ని తలపించేలా
ఆర్పీ ఇల్లు ఉంది. ఎంతో విలాసవంతమైన హాల్, డైనింగ్, కిచెన్ బెడ్ రూమ్స్ అన్నింటిని వారి అభిరుచికి అనుగుణంగా ఎంతో అందమైన ఇంటీరియర్ డిజైన్ తో తయారు చేయించారు. ఇక హాల్లో టీవీతో పాటు తనకు వచ్చిన అవార్డులను కూడా అందంగా అలంకరించి పెట్టారు.
రెండంతస్తులలో ఉన్నటువంటి ఆర్పీ ఇంటిలో లిఫ్ట్ సౌకర్యంతో పాటు ప్రత్యేకంగా హోమ్ థియేటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.ఇక ఈ హోమ్ టూర్ లో భాగంగా ఆర్పీ తాను ప్రేమించిన అమ్మాయి ఫోటోని కూడా అందరికీ చూపించారు. ఆ అమ్మాయితో తన అభిరుచులు కలవడం వల్ల ఇద్దరూ ప్రేమించుకున్నామని, పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని, నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఉంటుందని ఆర్పీ తాను ప్రేమించిన అమ్మాయిని ఈ సందర్భంగా పరిచయం చేశారు. అలాగే టెర్రస్ పై తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలను కూడా చూపించారు. ప్రస్తుతం ఆర్పీ ఇంటికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయన ఇంటిని చూసి చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…