Nagababu: సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ రెండింటికి ఎంత మంచి అనుబంధం ఉన్న ఈ రెండింటిని వేరువేరుగా చూడటమే ఎంతో మంచిది. ఇలా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా కుటుంబం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. అయితే ఈ పార్టీని విజయవంతంగా చిరంజీవి ముందుకు నడపలేక పోయారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి గుడ్ బై చెప్పడంతో నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించి ప్రజల ముందుకు వచ్చారు. ఇక జనసేన పార్టీకి చిరంజీవి దూరంగా ఉన్నప్పటికీ, నాగబాబు మాత్రం పార్టీ ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ తరపున నాగబాబు పలుసార్లు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.
ఈ విధంగా నాగబాబు వ్యవహారశైలి పూర్తిగా తన కొడుకు వరుణ్ తేజ్ కెరియర్ పై పడుతుందని తెలుస్తోంది. నాగబాబు మాట్లాడే మాటలు కారణంగా ఓ వర్గం వారు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నటించిన సినిమాలను చూడకూడదని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన సినీ కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేపథ్యంలో తన కెరియర్ కు తన తండ్రి బ్రేక్ వేస్తున్నారని చెప్పవచ్చు.
హీరోగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న వరుణ్ తేజ్ కి తన తండ్రి కారణంగా తన కెరియర్ ప్రమాదంలో పడుతుందని తెలుస్తోంది. అందుకు ఉదాహరనే గని ఫలితం అంటూ పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఈ సినిమా విడుదలకు ముందు నాగబాబు వ్యాఖ్యల వల్ల ఓ వర్గం వారు ఈ సినిమాని చూడకూడదని ఫిక్స్ అయ్యారు. అయితే గని సినిమా విడుదలైన తర్వాత మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి నాగబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వరుణ్ తేజ్ కి గుదిబండగా మారిపోయిందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…