సాధారణంగా కొన్ని సార్లు చిన్న చిన్న శబ్దాలు కూడా మనుషులలో ఎంతో భయాందోళనకు గురి చేస్తాయి. అదే కనుక పెద్దగా, వింతైన శబ్దాలు వినిపిస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి నిద్ర పోతున్న సమయంలో ఓ ఇంటిలో నుంచి ఓ యువతి పెద్దపెద్దగా కేకలు వేస్తోంది. అది విన్న స్థానికులు ఏం జరిగిందోనని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఏం జరిగిందో అని ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ విషయం బయటపడింది.
అమెరికాకు చెందిన హోలీ హంటర్ అనే యువతి అర్ధరాత్రి సమయంలో గట్టిగా కేకలు వేసింది.ఈ క్రమంలోనే ఏం జరిగిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడికి వచ్చి అసలు విషయం ఏంటని ఆరా తీశారు. ఈ క్రమంలోనే సదరు మహిళ తన బెడ్ పై పడుకొని ఉండగా ఒక సాలెపురుగు ఆమెకు దగ్గరగా రావడంతో భయపడి కేకలు వేసిందనే విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
కేవలం సాలెపురుగుకి భయపడి ఆ యువతి పెట్టిన కేకలు స్థానికులు తీవ్ర భయాందోళనలు కలిగించాయి. ఏం జరిగిందో అనే విషయం తెలియక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. కేవలం చిన్న పురుగుకు భయపడిన ఆ యువతిని చూసి పోలీసులు ఆమెపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెలియడంతో ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు కనుక సరిపోయింది.. లేదంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…