సాధారణంగా మన పెద్దవారు ఎప్పుడూ కూడా మనం తినే ప్రతి గింజపై మన పేరు ఉంటుందని చెబుతుంటారు. అలా మన పేరు రాసినవే మనకు దక్కుతాయని భావిస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా సమోసాల పై సీరియల్ నెంబర్ లు ఉండడం చూశారా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఢిల్లీలోని ఒక హోటల్లో సమోసాలపై సీరియల్ నెంబర్స్ ఉండడంతో వీటిని చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమోసాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీకి చెందిన నితిన్ మిశ్రా అనే వ్యక్తి ఒక హోటల్ నుంచి సమోసాలు ఆర్డర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సమోసాలు అతని ఇంటికి డెలివరీ అయ్యాయి. అయితే ఆ సమోసాలను తినాలని భావించిన నితిన్ మిశ్రాకు ఆ సమోసాలు పై సీరియల్ నెంబర్ ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ సమోసా ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. నేను ఆర్డర్ ఇచ్చిన సమోసాల పై సీరియల్ నెంబర్లు ఉన్నాయి.. టెక్ ప్లీజ్..నా హల్వాయికి దూరంగా ఉండవా అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమోసాల పై నెంబర్లు ఏంటి.. కొద్ది రోజులు పోతే క్యూఆర్ కోడ్ లు కూడా వస్తాయేమో అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ విధమైనటువంటి సమోసాలు ఈటరీ ‘సమోసా పార్టీ’ కి చెందినవి అంటూ కామెంట్ చేయగా మరికొందరు హోటల్ సిబ్బంది తినకుండా ఉండడం కోసం ఈ విధంగా నెంబర్స్ వేస్తున్నారా అంటూ తనదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…