ఆదివారం అంగరంగ వైభవంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం లాంచ్ అయ్యింది.ఈ క్రమంలోనే ఈ సీజన్ లో పాల్గొని 19 మంది కంటెస్టెంట్ లు ఒక్కొక్కరికి నాగార్జున వెల్ కమ్ చెబుతూ హౌస్ లోనికి పంపించారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి 13 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు కంటెస్టెంట్ సరయు. ఈమె బోల్డ్ బ్యూటీ గా బూతుల బ్యూటీగా పేరు సంపాదించుకుంది.
యూట్యూబ్ లో సెవెన్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా సరయు ఎన్నో వీడియోలలో పచ్చి బూతులు తిడుతూ బాగా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే ఈమె బూతుల బ్యూటీ గా ఫేమస్ అయింది. నోరు తెరిస్తేనే బూతులు మాట్లాడే సరియు ఇన్ని రోజులకు ఒక కరెక్ట్ ప్లేస్ కి వెళ్ళిందని చెప్పవచ్చు. ఈ విధంగా బోల్డ్ మాటలు మాట్లాడే వారి వల్ల కార్యక్రమానికి మంచి రేటింగ్స్ వస్తాయని నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే ఇలాంటి బ్యూటీలను ప్రతి సీజన్లోకి తీసుకువస్తారు.
కేవలం మాటలు మాత్రమే కాకుండా అందాలు ఆరబోయడంలో ఈమెకు ఈమె సాటని చెప్పవచ్చు.ఇలా పచ్చి బూతులు ద్వారా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన ఈ బ్యూటీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా రచ్చ చేస్తుందో తెలియాల్సి ఉంది. అక్కడ కూడా ఈమె బూతుల పురాణం మొదలు పెడితే నిర్వాహకులు రోజు బీప్ వేసుకోవాల్సిందేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. ఈమెకు బిగ్ బాస్ వేదికపైకి స్వాగతం చెప్పిన నాగార్జునతో ఎంతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే తనకు రామ్ చరణ్ అంటే ఇష్టమని తన బాడీ ఫిజిక్, మీసం కట్టు తనకెంతో నచ్చుతాయని తెలిపారు. తాను చిన్నప్పుడు ఒకసారి అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా వెళుతున్న సమయంలో ఈ స్టూడియో చూసి అది నాగేశ్వరరావుగారిదని తన తల్లి చెప్పినప్పుడు ఎలాగైనా అందులోకి వెళ్లాలని తన తల్లిని అడిగిందట.
అప్పుడు తన తల్లి అక్కడ కేవలం స్టార్స్ మాత్రమే ఉంటారని చెప్పడంతో ఎలాగైనా తన అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుందని ఆ నిర్ణయమే ఈ రోజు తనని ఇక్కడ నిలబెట్టింది అంటూ నాగార్జున గారితో ముచ్చటించారు. ఈ క్రమంలోనే తన ఏవి చూసిన నాగార్జున నువ్వు చాలా బోల్డ్ అంట కదా.. ఇప్పుడే ఏవీ చూశాను కానీ ఇక్కడ బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్ అంటూ నాగార్జున ఈ బోల్డ్ బ్యూటీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చి హౌస్ లోపలికి పంపించారు. మరి హౌస్ లో ఈ బోల్డ్ బ్యూటీ చేసే రచ్చ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…